Skip to main content

Bloomberg Businessweek: దేశంలో నంబర్‌వన్ బీ–స్కూల్‌ ఇదే..

ఇండియన్ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ (ఐఎస్‌బీ) దేశంలోనే నంబర్‌వన్ బిజినెస్‌ స్కూల్‌గా మరోసారి గుర్తింపు సాధించింది.
Bloomberg Businessweek
దేశంలో నంబర్‌వన్ బీ–స్కూల్‌ ఇదే..

బ్లూమ్‌బెర్గ్‌ బిజినెస్‌ వీక్‌ ఉత్తమ బీ–స్కూల్స్‌– 2021 ర్యాంకింగ్స్‌ను సెప్టెంబర్‌ 15న ప్రకటించారు. ఈ ర్యాంకింగ్స్‌లో ఆసియా–పసిఫిక్‌ ప్రాంతంలో 5వ స్థానంలో నిలిచింది. బిజినెస్‌ స్కూల్స్‌లో పోస్ట్‌గ్రాడ్యుయేట్‌ ప్రోగ్రామ్‌ ఇన్ మేనేజ్‌మెంట్‌(పీజీపీ)లో ఈ ర్యాంకింగ్స్‌ను ప్రకటించారు. 2021–22 ర్యాంకింగ్స్‌ను ప్రకటించేందుకు బ్లూమ్‌బెర్గ్‌ బిజినెస్‌ వీక్‌ ప్రపంచవ్యాప్తంగా 119 బిజినెస్‌ స్కూల్స్‌ను సర్వే చేసింది. 6,640 మంది విద్యార్థులు, 12,462 మంది పూర్వ విద్యార్థులు, 853 మంది యజమానులను సర్వే చేసి ర్యాంకింగ్స్‌ను నిర్ధారించారు. బిజినెస్‌ స్కూల్స్‌లో నిర్వహణ, ఎడ్యుకేషన్ –లెర్‌నింగ్, నెట్‌ వర్కింగ్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ వంటి నాలుగు అంశాలను ఆధారంగా చేసుకుని ర్యాంకింగ్స్‌ను ఇచ్చారు. ఆసియా–పసిఫిక్‌ ప్రాంతంలో ఐఎస్‌బీ లెరి్నంగ్, నెట్‌ వర్కింగ్‌లో రెండోస్థానం, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌లో మూడో స్థానం, పరిహారంలో ఆరవ స్థానంలో నిలిచింది.
స‌మష్టి కృషికి నిదర్శనం
ఐఎస్‌బీ అత్యుత్తమ ర్యాంకింగ్‌ సాధనకు ఫ్యాకల్టీ, అధికారులు, విద్యార్థులు, పూర్వ విద్యార్థుల సమష్టిగా చేసిన కృషికి నిదర్శనం. ర్యాంకింగ్‌లు మెరుగుపడటంతో మరింత బాధ్యతగా చిత్తశుద్ధితో కృషి చేస్తాం.

– ప్రొఫెసర్‌ మదన్ పిల్లుట్ల – డీన్ ఐఎస్‌బీ

చదవండి: 

ఐఎస్‌బీలో ఉచితంగా ‘ఫుడ్‌ అండ్‌ అగ్రికల్చర్‌’ కోర్సు

ఫోర్బ్స్ జాబితాలో ఐఎస్‌బీకి ఏడోస్థానం

Published date : 16 Sep 2021 05:48PM

Photo Stories