PDSU: నిబంధనలకు విరుద్ధంగా ‘గురుకుల’ నిర్వహణ

గురుకుల పాఠశాలను మార్చి 20న సందర్శించి ప్రమాద వివరాలు తెలుసుకున్నారు. వేడినీళ్లు పడి తీవ్రగాయాలైన విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని, అందుకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు.
పాఠశాల బిల్డింగ్‌లోకి వర్షం నీరు చేరి దుర్వాసన వస్తోందని, పాఠశాల ఆవరణలో విత్యుత్ వైర్లు కిందకి వేలాడుతున్నాయని, ప్లోరింగ్‌లేదని, వంటగది అపరిశుభ్రంగా ఉందని, భోజనంలో నాణ్యత లేదని ఆరోపించారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా క్యాటరింగ్ సిబ్బంది, మరుగుదొడ్ల నిర్మించాలన్నారు.
చదవండి: TSPSC: ‘ఏఈఈ’ కాపీయింగ్ కేసులో ఏడుగురి గుర్తింపు.. ఈ శాఖ మాజీ ఏఈదే కీలక పాత్ర
పని చేయని సీసీ కెమోరాలకు మరమ్మతులు చేయించాలన్నారు. సంబంధిత అధికారులు భవనాన్ని ఖాళీ చేయించి మౌలిక వసతులు ఉన్న నూతన భవనంలోకి మార్చాలని లేదంటే సొంత భవనం నిర్మించాలన్నారు. అలా చేయకుంటే ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్‌యూ నాయకులు గుజ్జుల అశోక్‌తోపాటు తదితరులు పాల్గొన్నారు.