Skip to main content

ఐఎస్‌బీలో ఉచితంగా ‘ఫుడ్‌ అండ్‌ అగ్రికల్చర్‌’ కోర్సు

రాయదుర్గం (హైదరాబాద్‌): ఆహారం, వ్యవసాయంపై ఆసక్తి ఉన్న వారికోసం ఐఎస్‌బీ ప్రత్యేక ఆన్‌లైన్‌ కోర్సుకు శ్రీకారం చుట్టింది.
ఇండియా డేటా పోర్టల్‌(ఐడీపీ), ఇండియాస్పెండ్‌ స్కూల్‌ ఆఫ్‌ డేటా జర్నలిజం(ఐఎస్‌డీజే) సంయుక్తంగా ‘బెటర్‌ రిపోర్టింగ్‌ ఆన్‌ ఫుడ్‌ అండ్‌ అగ్రికల్చర్‌’కోర్సును ఐఎస్‌బీలో ప్రారంభించాయి. ఈ కోర్సును పూర్తిగా ఉచితంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. జర్నలిస్టులు, పరిశోధకులు, ఆహార, వ్యవసాయ సంఘాల సభ్యులతోపాటు వివిధ రంగాలకు చెందిన నిపుణులు, విద్యావేత్తలు తదితరులు ఈ కోర్సును అభ్యసించవచ్చు. ఈ కోర్సులో చేరేవారికి ఐఎస్‌బీలోని భారతీయ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ పాలసీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ అశ్విని ఛత్రేతోపాటు ఇతర ప్రొఫెసర్లు శిక్షణ ఇస్తారు. కోర్సు పూర్తయిన తర్వాత ఆన్‌లైన్‌ ధ్రువీకరణ పత్రాన్ని కూడా అందజేస్తారు. ఈ కోర్సులో చేరాలనుకునేవారు వెబ్‌సైట్‌ https://isdj.in/course/better--reporting-on-food-and-agriculture  లో తమ పేర్లను నమోదు చేసుకోవాలి.
Published date : 07 Jun 2021 02:01PM

Photo Stories