Skip to main content

New Online Courses: ‘ISB’లో మరో రెండు కొత్త ఆన్‌లైన్‌ కోర్సులు

రాయదుర్గం: ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ (ఐఎస్‌బీ)లో మరో రెండు కొత్త కోర్సులకు శ్రీకారం చుట్టారు.
New Online Courses
‘ISB’లో మరో రెండు కొత్త ఆన్‌లైన్‌ కోర్సులు

ఐఎస్‌బీలోని భారతి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ పాలసీ(బీఐపీపీ), కెసాసిటీ బిల్డింగ్‌ కమిషన్‌ (సీబీసీ) భారత ప్రభుత్వ సంయుక్త ఆధ్వర్యంలో ఈ రెండు కొత్త కోర్సులను ప్రారంభించారు. మిషన్‌ కర్మయోగి చొరవ కింద ఐజీఓటీ ప్లాట్‌ఫారమ్‌లో ఈ ఆన్‌లైన కోర్సులను నిర్వహిస్తారు. ఐఎస్‌బీ భారతి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ పాలసీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ అశ్విని ఛత్రే సమక్షంలో సీబీసీ ప్రోగ్రామ్‌ మేనేజర్‌ హిమాన్షు పాండేతో కలిసి భారత ప్రభుత్వంలోని సిబ్బంది, శిక్షణ శాఖ కెపాసిటీ బిల్డింగ్‌ కమిషన్‌ సెక్రటరీ హేమంగ్‌ జానీ ఈ కోర్సులను జూలై 7న ప్రారంభించారు. 

చదవండి: ISB: ఎగ్జిక్యూటివ్‌ ఎంబీఏ ర్యాంకుల్లో ఐఎస్‌బీ టాప్‌

కొత్త ఆన్‌లైన్‌ కోర్సులు ఇవే... 

ఐఎస్‌బీలో బీఐపీపీ, సీబీసీ సంయుక్తంగా ఆన్‌లైన్‌ కొత్త కోర్సులు రెండింటిని ప్రారంభించారు. ‘ఎవిడెన్స్‌ ఇన పబ్లిక్‌ పాలసీ’ మరియు ‘ఇన్‌సైట్స్‌ ఫ్రమ్‌ డేటా ఫర్‌ పాలసీ’ పేరిట ప్రొఫెసర్‌ అశ్విని ఛత్రే రచించినవి, సీనియర్‌ ప్రభుత్వ ఉద్యోగుల పబ్లిక్‌ పాలసీలో నైపుణ్యాన్ని బలోపేతం చేయడం లక్ష్యంగా పెట్టుకున్నాయి. 

చదవండి: Bumper Offers: ఐఎస్‌బీ విద్యార్థులకు అత్యధిక వేతనాలతో ఉద్యోగాలు.. ఓ విద్యార్థికి అయితే ఏకంగా..
      ఈ సందర్భంగా కెపాసిటీ బిల్డింగ్‌ కమిషన్‌ కార్యదర్శి హేమంగ్‌ జానీ మాట్లాడుతూ... బీఐపీపీ సహకారంతో పబ్లిక్‌పాలసీపై రెండు కోర్సులను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. ఐఎస్‌బీలోని బీఐపీపీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ అశ్విని ఛత్ర మాట్లాడుతూ... ఈ కొత్త కోర్సులు పౌరులకు దాని ఫలితాలను మెరుగు పరచాలనే లక్ష్యంతో పబ్లిక్‌ పాలసీల సామర్థ్యాన్ని, ప్రభావాన్ని పెంచడమే లక్ష్యంగా పెట్టుకొని ప్రారంభించినవని అన్నారు. 

Published date : 08 Jul 2023 05:45PM

Photo Stories