ప్రముఖ ఆంగ్ల పత్రిక Financial Times ప్రకటించిన Executive MBA Rankings – 2022లో గచ్చిబౌలిలోని Indian School of Business (ISB) సత్తా చాటింది.
ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ ర్యాంకుల్లో ఐఎస్‌బీ టాప్
దేశంలోనే నంబర్ వన్ విద్యాసంస్థగా నిలిచింది. అలాగే ప్రపంచవ్యాప్తంగా 44వ స్థానాన్ని పొందింది. ఐఎస్‌బీలో నిర్వహిస్తున్న కోర్సులకు అంతర్జాతీయంగా 16వ స్థానం, వేతనం విషయంలో 20వ స్థానం, కెరీర్ పురోగతిలో 28వ స్థానం, పరిశోధనలో 52వ స్థానం, పర్యావరణ, సామాజిక, పాలన (ఈఎస్‌జీ)లో 9వ స్థానం లభించాయి.
ఈ విషయాన్ని ఐఎస్‌బీ అక్టోబర్ 17న విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. తమ ప్రొఫెసర్లు, పాలనా యంత్రాంగం, విద్యార్థులు, పూర్వ విద్యార్థుల సమష్టి కృషికి ఈ ర్యాంకులు నిదర్శనమని ఐఎస్‌బీ డిప్యూటీ డీన్ ప్రొఫెసర్ రామభద్రన్ తిరుమలై పేర్కొన్నారు.