Indian School of Business: హైదరాబాద్‌కు చెందిన ఐఎస్‌బీతో ఒప్పందం చేసుకున్న రాష్ట్రం?
యువతకు స్థానికంగా ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నైపుణ్యాభివృద్ధి కార్యక్రమంలో భాగస్వామి కావడానికి హైదరాబాద్‌కు చెందిన ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్‌బీ) ముందుకొచ్చింది. జాతీయ నూతన విద్యా విధానం ప్రకారం కొత్త కోర్సుల్లో శిక్షణ ఇచ్చేలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏపీఎస్‌ఎస్‌డీసీ), ఏపీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అకాడమీతో (అపిట) కలసి శిక్షణ కార్యక్రమాల్లో ఐఎస్‌బీ పాలుపంచుకోనుంది. ఈ మేరకు ఏపీఎస్‌ఎస్‌డీసీ, అపిట, ఐఎస్‌బీ మధ్య ఒప్పందం జరగనుంది. ఒప్పందంలో భాగంగా ప్రవర్తన నైపుణ్యాలు, వ్యాపార దక్షత కోర్సుల్లో శిక్షణకు ఐఎస్‌బీ సహకారం అందిస్తుంది.
దావో ఈవీటెక్‌తో ఒప్పందం
ఎలక్ట్రిక్ స్కూటర్ మాన్యుఫార్చురింగ్ కంపెనీ దావో ఈవీటెక్, అనుబంధ సంస్థ అమరావతి ఈవీ కన్సల్టింగ్ అండ్ ట్రేడింగ్ ప్రైవేట్ లిమిటెడ్‌తో అక్టోబర్ 7న ఏపీఎస్‌ఎస్‌డీసీ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లో ఈ కామర్స్ రంగంలో ఉపాధి అవకాశాలు మెరుగుపరచడం లక్ష్యంగా ఈ ఒప్పందం కుదిరింది.
చదవండి: వైఎస్సార్ ఆసరా పథకాన్ని తొలుత ఎప్పుడు ప్రారంభించారు?
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్‌బీ)తో ఒప్పందం చేసుకోనున్న రాష్ట్ర ప్రభుత్వం
ఎప్పుడు : అక్టోబర్ 7
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
ఎందుకు : యువతకు స్థానికంగా ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో...
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్