Andhra Pradesh: వైఎస్సార్ ఆసరా పథకాన్ని తొలుత ఎప్పుడు ప్రారంభించారు?
పొదుపు సంఘాల మహిళలకు ఆర్ధిక తోడ్పాటు అందించేందుకు ఉద్దేశించిన ‘వైఎస్సార్ ఆసరా పథకం’ రెండో విడతను అక్టోబర్ 7న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. ప్రకాశం జిల్లా ఒంగోలులోని పీవీఆర్ బాలుర ఉన్నత పాఠశాల ప్రాంగణంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం సీఎం మాట్లాడుతూ... ‘‘రాష్ట్రంలో 7,97,000 పొదుపు సంఘాల్లో ఉన్న 78,76,000 మంది అక్కచెల్లెమ్మలు 2019 ఏప్రిల్ నాటికి రూ.25,517 కోట్లు బ్యాంకులకు బాకీ పడ్డారు. ఈ మొత్తాన్ని వైఎస్సార్ ఆసరా పథకం ద్వారా 4 విడతల్లో ఉచితంగా వారి చేతికే అందిస్తామని చెప్పాం. ఆ మాటకు కట్టుబడి తొలి ఏడాది రూ.6,318 కోట్లు ఇచ్చాం. రెండో ఏడాది రూ.6,440 కోట్లు జమ చేస్తున్నాం. రెండు విడతల్లో రూ.12,758 కోట్లు లబ్ధి కలిగించాం.’’అని పేర్కొన్నారు.
2020, సెప్టెంబర్ 11న...
2019, ఏప్రిల్ 11 నాటికి పొదుపు సంఘాల పేరిట బ్యాంకుల్లో ఉండే అప్పు మొత్తాన్ని నాలుగు విడతల్లో చెల్లించే వైఎస్సార్ ఆసరా పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ 2020, సెప్టెంబర్ 11న లాంఛనంగా ప్రారంభించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి కంప్యూటర్‌లో బటన్ నొక్కి తొలి దశలో రూ.6,792.20 కోట్లను పొదుపు సంఘాల మహిళల ఖాతాలకు సీఎం జమ చేశారు.
చదవండి: శానిటరీ న్యాప్‌కిన్ల పంపిణీకి ప్రభుత్వం ప్రారంభించిన కార్యక్రమం?
క్విక్ రివ్యూ :
ఏమిటి : వైఎస్సార్ ఆసరా పథకం రెండో విడత ప్రారంభం
ఎప్పుడు : అక్టోబర్ 7
ఎవరు : ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
ఎక్కడ : పీవీఆర్ బాలుర ఉన్నత పాఠశాల, ఒంగోలు, ప్రకాశం జిల్లా
ఎందుకు : పొదుపు సంఘాల మహిళలకు ఆర్ధిక తోడ్పాటు అందించేందుకు...
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్