Skip to main content

ఫోర్బ్స్ జాబితాలో ఐఎస్‌బీకి ఏడోస్థానం

ఫోర్బ్స్ మేగజైన్ సెప్టెంబర్ 18న ప్రకటించిన ప్రపంచంలోనే ఉత్తమ బిజినెస్ స్కూల్స్-100 ర్యాంకుల్లో హైదరాబాద్‌లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్‌బీ)కి ఏడో స్థానం లభించింది.
ఎంబీఏ కేటగిరీలో ఆసియా వ్యాప్తంగా అత్యుత్తమ బి-స్కూల్‌గా ఐఎస్‌బీ గుర్తింపు పొందింది. ఫోర్బ్స్ ర్యాంకుల్లో ఐఎస్‌బీకి చోటు లభించడం 2019 ఏడాదే తొలిసారి. ప్రతీ రెండేళ్లకు ఒకసారి అంతర్జాతీయంగా అత్యుత్తమ బి స్కూళ్ల ర్యాంకులను ఫోర్బ్స్ సంస్థ ప్రకటిస్తుంటుంది. ఎంబీఏ పూర్తి చేసిన వారికి లభిస్తున్న పారితోషికం, కెరీర్ ఎంపికలు తదితర ఎన్నో అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ ర్యాంకులను కేటాయించింది.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
ఫోర్బ్స్ ఉత్తమ బిజినెస్ స్కూల్స్-100 ర్యాంకుల్లో ఏడో స్థానం
ఎప్పుడు : సెప్టెంబర్ 18
ఎవరు : ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్‌బీ)
ఎక్కడ : ప్రపంచంలో
Published date : 19 Sep 2019 05:31PM

Photo Stories