Skip to main content

AUCET 2022: ప్రవేశాల కౌన్సెలింగ్‌ తేదీ ఇదే..

ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఆరేళ్ల సమీకృత ఇంజనీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఆఈట్‌ 2022 కౌన్సెలింగ్‌ ప్రక్రియను జూలై 25వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు ప్రవేశాల సంచా లకుడు ఆచార్య డి.ఎ.నాయుడు తెలిపారు.
AUCET 2022
ప్రవేశాల కౌన్సెలింగ్‌ తేదీ ఇదే..

ర్యాంకులు సాధించిన విద్యార్థులు జూలై 22వ తేదీ నుంచి తమ హాల్‌ టికెట్లను ప్రవేశాల సంచాలకుల వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. 25న రిజిస్ట్రేషన్‌ రుసుం చెల్లించి కౌన్సెలింగ్‌కు హాజరు కావచ్చన్నారు. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.250, ఇతరులకు రూ.500 ప్రవేశ కౌన్సెలింగ్‌ రుసుంగా చెల్లించాల్సి ఉంటుందన్నారు. సీఏ పీ, పీహెచ్‌ విభాగాల వారికి 27న పెదవాల్తేరులోని డైరెక్టరేట్‌ ఆఫ్‌ అడ్మిషన్స్‌ కార్యాలయంలో సర్టిఫికెట్ల పరిశీలన జరుపుతారు. 27, 28 తేదీల్లో ఎన్‌సీసీ, క్రీడా విభాగాల వారు తమ సర్టిఫికెట్లను అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. ఇతర అభ్యర్థులంతా తమ సర్టిఫికెట్లను 27 నుంచి 31వ తేదీ వరకు అప్‌లోడ్‌ చేయాలి. వెబ్‌ ఆప్షన్లు ఆగస్టు 1 నుంచి 4వ తేదీ వరకు ఇవ్వాలి. తొలిదశ సీట్ల కేటాయింపు ఆగస్టు 7న ఉంటుంది. వివరాలను http://audoa.in నుంచి పొందాలి.

చదవండి: 

Published date : 21 Jul 2022 01:43PM

Photo Stories