ఏఎన్‌యూ: రాష్ట్ర వ్యాప్తంగా ఫిజికల్ ఎడ్యుకేషన్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహిస్తున్న ఏపీ పీసెట్–2023లో భాగంగా ప్రవేశ పరీక్షలు ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో మే 31న ప్రారంభమయ్యాయి.
ఏపీ పీసెట్ ప్రవేశ పరీక్షలు ప్రారంభం
రాష్ట్ర ఉన్నత విద్యామండలి ప్రవేశ పరీక్షల ఓఎస్‌డీ డాక్టర్ ఎం.సుధీక్ కుమార్ ప్రవేశ పరీక్షలను ప్రారంభించారు. దేహదారుఢ్యం, క్రీడా నైపుణ్య పరీక్షలను పరిశీలించారు. తొలిరోజు ప్రవేశ పరీక్షలకు 340 మంది హాజరయ్యారని పీసెట్ కన్వీనర్ ఆచార్య పీపీఎస్ పాల్‌కుమార్ తెలిపారు.