Skip to main content

GPAT 2024 Notification: గ్రాడ్యుయేట్‌ ఫార్మసీ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ (జీప్యాట్‌) నోటిఫికేషన్‌ విడుదల, పరీక్ష తేదీ ఎప్పుడంటే..

GPAT 2024 Notification  GPAT 2024 Notification  GPAT 2024 Entrance Exam  NTA Announcement

గ్రాడ్యుయేట్‌ ఫార్మసీ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌(జీప్యాట్‌)-2024 నోటిఫికేషన్‌ విడుదలైంది. ఎంఫార్మా ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి నిర్వహించే ఈ ప్రవేశ పరీక్ష తేదీలను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఎన్‌టీఏ ప్రకటించింది. ఈ పరీక్షలో ర్యాంకు పొందినవారు దేశంలోని ప్రముఖ ఫార్మసీ కళాశాలల్లో తమకు నచ్చిన స్పెషలైజేషన్‌లో ఫార్మసీ పీజీ (ఎంఫార్మసీ) చదువుకోవటానికి వీలవుతుంది.  ప్రశ్నపత్రం ఆంగ్ల మాధ్యమంలోనే ఉంటుంది. సీబీటీ విధానంలో ప్రశ్నపత్రం ఉంటుంది. 

అర్హత: ఇంటర్మీడియట్‌ తర్వాత ఫార్మసీలో నాలుగేళ్ల బ్యాచిలర్స్‌ డిగ్రీ/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి. బీఫార్మసీ పరీక్షా ఫలితాలు వెలువడిన చివరి సంవత్సరం విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. బీటెక్‌(ఫార్మాస్యూటికల్‌ అండ్‌ ఫైన్‌ కెమికల్‌ టెక్నాలజీ)/తత్సమాన అభ్యర్థులు దీనికి అర్హులు కాదు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. 

దరఖాస్తు ప్రారంభ తేది:  ఏప్రిల్‌ 11 (3pm నుంచి)
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: మే 8 (11.55 pm)వరకు

జీప్యాట్‌ పరీక్ష తేది: జూన్‌ 8
జీప్యాట్‌ ఫలితాల వెల్లడి: జులై 8

వెబ్‌సైట్‌: https://gpat.nta.nic.in/

 

GPAT 2024 Notification

 

Published date : 19 Apr 2024 04:35PM

Photo Stories