Skip to main content

AP EDCET 2024: ఏపీ ఎడ్‌సెట్‌ నోటిఫికేషన్‌ విడుదల.. దరఖాస్తు చివ‌రి తేదీ ఇదే

ఏయూ క్యాంపస్‌: రాష్ట్ర వ్యాప్తంగా బీఈడీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఏపీ ఎడ్‌సెట్‌– 2024కు నోటిఫికేషన్‌ విడుదల చేసినట్లు కన్వీనర్‌ ఆచార్య టి.వి.కృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు.
Acharya T V Krishna Updates on AP Edset 2024 Admission Process   AP EDCET 2024 Notification Released  Notification Released   AP Edset 2024 for BEd Courses

మే 15వ తేదీ వరకు దరఖాస్తులను ఆన్‌లైన్‌లో స్వీకరిస్తామని, రూ.1000 అపరాధ రుసుముతో మే 19 వరకు, రూ.2 వేల అపరాధ రుసుముతో మే 21వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉందని పేర్కొన్నారు.

చదవండి: Four Years Degree Plus Bed Course 2023 : ఇక‌పై నాలుగేళ్లలోనే డిగ్రీ ప్లస్‌ బీఈడీ.. ప్రవేశ పరీక్ష ఇలా.. ద‌ర‌ఖాస్తు చివ‌రి తేదీ ఇదే..

అభ్యర్థుల దరఖాస్తు రుసుముగా రూ.600 నిర్ణయించామని, బీసీలు రూ.500, ఎస్సీ, ఎస్టీలు రూ.450 చొప్పున చెల్లించాలని తెలిపారు.

మే 30 నుంచి ఆన్‌లైన్‌లో హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవాలని సూచించారు. జూన్‌ 8న రాష్ట్ర వ్యాప్తంగా 36 సెంటర్లలో ప్రవేశ పరీక్ష నిర్వహిస్తామని తెలి­పారు. అభ్యర్థులు www.cetr.aprche.ap.gov.in నుంచి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 
 

Published date : 20 Apr 2024 03:38PM

Photo Stories