Skip to main content

Four Years Degree Plus Bed Course 2023 : ఇక‌పై నాలుగేళ్లలోనే డిగ్రీ ప్లస్‌ బీఈడీ.. ప్రవేశ పరీక్ష ఇలా.. ద‌ర‌ఖాస్తు చివ‌రి తేదీ ఇదే..

సాక్షి ఎడ్యుకేష‌న్ : సాధారణంగా బీఈడీ చేయాలంటే మూడేళ్ల డిగ్రీ పూర్తి చేసి, రెండేళ్ల బ్యాచులర్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ కోర్సు చేయాలి. దీనికి మొత్తం ఐదేళ్లు పడుతుంది.
Four Years Degree Plus Bed Course 2023 Details in Telugu
Four Years Degree Plus Bed Course 2023

కొత్త విధానం వల్ల నాలుగేళ్లలోనే పూర్తి చేసే వీలుంది. ఈ ఏడాది నుంచే సమీకృత బీఈడీ కోర్సులు ప్రారంభం కానున్నాయి. ఇంటర్‌ తర్వాత నాలుగేళ్లలోనే డిగ్రీతో పాటు బీఈడీ పూర్తి చేయవచ్చు. 

☛ Union Ministry of Education: నాలుగేళ్ల కోర్సుగా బీఈడీ.. నవీన బోధన విధానం..

ఆంధ్రప్రదేశ్‌లో..
జాతీయ విద్యా విధానం–2020లో భాగంగా తీసుకొచ్చిన ఈ కోర్సును జాతీయ స్థాయిలో పలు కళాశాలల్లో ప్రవేశపెడుతున్నారు. వీటిలో ప్రవేశానికి నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) దేశ వ్యాప్తంగా 178 పట్టణాల్లో 13 మాధ్యమాల్లో కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్టు (సీబీటీ) నిర్వహిస్తోంది. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ను జూన్ 6వ తేదీ (సోమవారం) ఎన్‌టీఏ విడుదల చేసింది. తద్వారా ఆంధ్రప్రదేశ్‌లో రెండు వర్సిటీల్లో ఇంటిగ్రేటెడ్‌ బీఎస్సీ బీఈడీ, బీఏ బీఈడీ కోర్సులు అందుబాటులోకి వచ్చాయి.

చ‌ద‌వండి: టీచర్‌ కొలువుకు తొలిమెట్టు.. టెట్‌లో అర్హత సాధించే ప్రణాళిక ఇదిగో..!

ఈ కోర్సులో అత్యధిక ప్రాధాన్య‌త దీనికే..

four year degree plus bed courses telugu news

ఎన్టీఏ 2023–24 విద్యా సంవత్సరానికి తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం, ఎచ్చెర్లలోని బీఆర్‌ అంబేడ్కర్‌ విశ్వవిద్యాలయంలో మొత్తం 150 సీట్లలో ప్రవేశాలు కల్పించనున్నారు. ఆధునిక విద్యా బోధనకు అనుగుణంగా సమీకృత బీఈడీ కోర్సును ఎన్‌సీఈఆర్‌టీ రూపొందించింది. విద్యార్థి మానసిక ధోరణి, ఆన్‌లైన్, డిజిటల్‌ విద్యా బోధనతో పాటు సరికొత్త మెలకువలతో ఎలా బోధించాలన్న అంశానికి ఈ కోర్సులో అత్యధిక ప్రాధాన్యమిస్తారు. తరగతి గదిలో పాఠాల కన్నా, అనుభవం ద్వారా నేర్చుకునే రీతిలో పాఠ్య ప్రణాళిక రూపొందించినట్టు అధికారులు చెబుతున్నారు.

చదవండి: Teachersగా B Tech‌ బాబులు వద్దా?.. కనిపించని బీటెక్‌ కాలమ్‌..

ప్రవేశ పరీక్ష విధానం ఇలా..
ఇంటర్‌ ఉత్తీర్ణులు ఈ ప్రవేశ పరీక్ష రాయాల్సి ఉంటుంది. పన్నెండో తరగతి, ఇంటర్‌ సిలబస్‌లోంచి ప్రశ్నలు ఇస్తారు. మొత్తం 160 బహుళ ఐఛ్చిక‌ ప్రశ్నలుంటాయి. జనరల్‌ నాలెడ్జ్, కరెంట్‌ అఫైర్స్, జనరల్‌ మెంటల్‌ ఎబిలిటీ, న్యూమరికల్‌ ఎబిలిటీ, లాజికల్‌ అండ్‌ అనలిటికల్‌ రీజనింగ్, టీచింగ్‌ అప్టిట్యూడ్‌ నుంచి ప్రశ్నలు ఇస్తారు. ఎన్‌సీఈఆర్‌టీ ప్రశ్నపత్రాన్ని రూపొందిస్తుంది.

చ‌ద‌వండి: TS Gurukulam Teacher Jobs: టీఎస్‌ గురుకులాల్లో 9,231 పోస్టులు.. విజయం సాధించే మార్గాలు ఇవే..

ముఖ్య‌మైన తేదీలు ఇవే..
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ 19.7.2023 
డేటా కరెక్షన్‌కు చివరి తేదీ  20.7.2023 
పరీక్ష తేదీ : తర్వాత ప్రకటించ‌నున్నారు 
హాల్‌ టికెట్ల డౌన్‌లోడ్ : పరీక్షకు మూడు రోజుల ముందు 
దరఖాస్తు చేసుకోవాల్సిన వెబ్‌సైట్లు : www.nta.ac.in, https://neet. samarth.ac.in/

Published date : 28 Jun 2023 01:56PM

Photo Stories