Skip to main content

AP PECET: కౌన్సెలింగ్‌ తేదీలు ఇవే..

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వ్యాయామ విద్య కళాశాలల్లో బీపీఈడీ, యూజీడీపీఈడీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహిస్తున్న ఏపీ పీసెట్‌–2022 కౌన్సెలింగ్‌ ప్రక్రియ అక్టోబర్‌ 20వ తేదీన ప్రారంభిస్తున్నట్లు పీసెట్‌ కన్వీనర్‌ ఆచార్య పి.జాన్సన్‌ తెలిపారు.
AP PECET
ఏపీ పీసెట్ కౌన్సెలింగ్‌ తేదీలు ఇవే..

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ ఆచార్య కె.హేమచంద్రారెడ్డి అధ్యక్షతన అక్టోబర్‌ 17న ఆన్‌లైన్‌లో జరిగిన ఏపీ పీసెట్‌ కమిటీ సమావేశంలో కౌన్సెలింగ్‌ ప్రక్రియ తేదీలు ఖరారు చేశారు. అక్టోబర్‌ 20 నుంచి 22వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్, 21 నుంచి 23వ తేదీ వరకు ఆన్‌లైన్‌ విధానంలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ ఉంటుందని చెప్పారు.

చదవండి: AP EAPCET: తుదివిడత కౌన్సెలింగ్‌ తేదీలు ఇవే..

ప్రత్యేక కేటగిరీకి చెందిన ఎన్‌సీసీ, క్యాప్‌ అభ్యర్థులు అక్టోబర్‌ 22న ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో జరిగే సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరుకావాలని కోరారు. 25, 26 తేదీల్లో ఆన్‌లైన్‌లో కళాశాలల ఎంపికకు ఆప్షన్స్, 27న వెబ్‌ ఆప్షన్స్‌ మార్చుకునే వెసులుబాటు, 29న సీట్ల కేటాయింపు ఉంటుందని తెలిపారు. అక్టోబర్‌ 31వ తేదీ నుంచి నవంబర్‌ 4వ తేదీ వరకు అభ్యర్థులు తమకు సీటు వచ్చిన కళాశాలలో రిపోర్టు చేయాలని వివరించారు.

చదవండి: APPSC: అటవీశాఖలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

Published date : 18 Oct 2022 03:19PM

Photo Stories