Agri Polytechnic: అగ్రి పాలిటెక్నిక్ దరఖాస్తుల గడువు పెంపు
Sakshi Education
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ వర్సిటీ, డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన వర్సిటీ, శ్రీ వేంకటేశ్వర పశు వైద్య విశ్వవిద్యాలయాల పరిధిలో నిర్వహిస్తున్న వివిధ పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్దేశించిన గడువును సెప్టెంబర్ 13 వరకు పొడిగించారు.
కరోనా పరిస్థితులు, పదో తరగతి విద్యార్థుల తల్లిదండ్రుల వినతి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు యూనివర్శిటీ రిజిస్ట్రార్ టి.గిరిధరకృష్ణ సెప్టెంబర్ 7న ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ వర్సిటీ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలి. మూడు వర్సిటీల పరిధిలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలల్లో 2021–22 విద్యా సంవత్సరానికి సంయుక్త ఆ¯ŒSలైన్ కౌన్సెలింగ్ నిర్వహణ బాధ్యతను ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం చేపట్టింది.
Published date : 08 Sep 2021 03:21PM