ఇంటెక్స్ ఆక్వా వండర్
కంప్యూటర్ పరికరాల తయారీ సంస్థ ఇంటెక్స్ ఆక్వా వండర్ పేరుతో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. 8.9 మి.మీ. మందముండే ఈ స్మార్ట్‌ఫోన్ 4.1 జెల్లీబీన్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. దాదాపు 4.5 అంగుళాల స్క్రీన్, ఒక గిగాహెర్ట్జ్ డ్యుయెల్‌కోర్ ప్రాసెసర్, 512 ఎంబీ ర్యామ్‌తో వచ్చే ఆక్వా వండర్‌లో నాలుగు గిగాబైట్ల ఇంటర్నల్ స్టోరేజీ ఉంటుంది. దీన్ని మైక్రోఎస్‌డీ ద్వారా 32 గిగాబైట్లకు పెంచుకోవచ్చు.
డ్యుయెల్ సిమ్, త్రీజీ, 8 మెగాపిక్సెళ్ల రియర్, 1.3 మెగాపిక్సెళ్ల ఫ్రంట్ కెమెరాలతో కూడిన ఈ స్మార్ట్‌ఫోన్ 1800 ఎంఏహెచ్ బ్యాటరీతో పనిచేస్తుంది. దీంతో 3.5 గంటల టాక్‌టైమ్, 72 గంటల స్టాండ్‌బై టైమ్ లభిస్తుందని అంచనా. ఎన్విరాన్‌మెంట్ లైట్ సెన్సర్, మోషన్, జీ, ప్రాక్సిమిటీ సెన్సర్లు కూడా ఉన్నాయి. ప్యాట్రెన్ లాకింగ్, స్క్రీన్ ఫేస్ అన్‌లాక్ సౌకర్యాలతోపాటు నాయిస్ రిడక్షన్ కోసం డ్యుయెల్ మైక్‌లున్నాయి. ఆంగ్రీబర్డ్స్, టాకింగ్ టామ్ వంటి ఆండ్రాయిడ్స్‌తో కలిపి వచ్చే ఇంటెక్స్ ఆక్వా వండర్ ధర దాదాపు రూ.9990.