BJYM: ఇంజనీరింగ్ సీట్ల భర్తీలో అవకతవకలు లేకుండా చూడాలి
డొనేషన్ల పేరు మీద తల్లిదండ్రులపై అధిక భారం మోపుతూ ఫీజుల దోపిడీకి పాల్పడుతున్న కళాశాలల యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది. ఈమేరకు మే 28న లింబాద్రికి బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు సేవెళ్ల మహేందర్ ఆధ్వర్యంలో వినతిపత్రం అందించారు.
ఈ సందర్భంగా మహేందర్ మాట్లాడు తూ ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలు వ్యాపార సంస్థలుగా మారాయని, విద్యార్థుల సీట్లు, స్పాట్ అడ్మిషన్ జరిపే విషయంలో కళాశాలల యాజమాన్యాలు స్లైడింగ్ పద్ధతిలో గ్రూపులు మార్చుకునే విషయంలో పారదర్శకంగా జరిగేట ట్లు చూడాలని విన్నవించారు.
చదవండి: ఇంజనీరింగ్ - జాబ్ గైడెన్స్ | ప్రాజెక్ట్ గైడెన్స్ | సక్సెస్ స్పీక్స్ | గెస్ట్ స్పీక్స్ | న్యూస్
అధిక ఫీజులు వసూలు చేస్తున్న ఇంజనీరింగ్ కళాశాలలపై కట్టు దిట్టమైన చర్యలు చేపట్టి నియంత్రించాలన్నారు. వర్సిటీలకు న్యాయబద్ధంగా వీసీల నియామకం జరిగేలా, అర్హులకు అవకాశం లభించేలా చూడా లని కోరారు. ఈ విషయంలో నియమ నిబంధ నలు పాటించకపోతే బీజేవైఎం ఆధ్వర్యంలో రా ష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చ రించారు.
రాష్ట్రంలో మార్పుపేరిట అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులు, విద్యా వ్యవస్థ పట్ల అలసత్వం వహించకుండా పేద విద్యార్థుల పట్ల చిత్తశుద్ధితో వ్యవహరించాలని సీఎంను కోరారు. కార్యక్రమంలో హెడ్‌క్వార్టర్ ఇన్‌చార్జి ఉపాధ్యక్షుడు మహేశ్, యోగి, సంతోష్, సందీప్, చిత్తరంజన్, తరుణ్‌రెడ్డి పాల్గొన్నారు.