Engineering Colleges: రాష్ట్రంలో ఇంజినీరింగ్ కళాశాలల్లో ప్రవేశాలు
విజయనగరం అర్బన్: రాష్ట్రంలో ఇంజినీరింగ్ కళాశాలల్లో ప్రవేశాల సందడి తాజాగా మొదలైంది. ఈ నేపథ్యంలో ఉత్తమ ప్రమాణాలున్న కళాశాలలను ఎంపిక చేసుకునే పనిలో ఇంజినీరింగ్ అభ్యర్థులు బిజీగా ఉన్నారు. పట్టణ శివారున ఉన్న జేఎన్‌టీయూ గురజాడ విజయనగరం (జీవీ) యూనివర్సిటీ పరిధిలోని జేఎన్‌టీయూ ఇంజినీరింగ్ కళాశాల ఉద్యోగకల్పనలో ముందు వరుసలో ఉంది. రెండేళ్ల నుంచి నూతన విద్యా విధానాన్ని కళాశాలలో అమలులోకి తెచ్చింది. మరో వైపు ఉన్నత విద్యశాఖ ఈ కళాశాల ప్రాంగణంలో జేఎన్‌టీయూ, గురజాడ విజయనగరం (జీవీ) యూనివర్సిటీని గత ఏడాది విద్యాసంవత్సరంలో ఏర్పాటు చేసింది.
Free Computer Training: స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఉచిత కంప్యూటర్ శిక్షణ
నూతన సిలబస్‌తో బోధన
విద్యార్థుల నైపుణ్యం పెంచే విధంగా మొదటి సంవత్సరం ఇంజినీరింగ్ కోర్సులలో హానర్స్, మైనర్ పేరుతో విస్తరణ డిగ్రీలను గత ఏడాది నుంచి ప్రవేశపెట్టారు. జాతీయ నూతన విద్యావిధానానికి అనుగుణంగా రాష్ట్ర ఉన్నత విద్యామండలి రూపొందించిన నూతన సిలబస్, బోధనావిధానాన్ని అమలులోకి తెచ్చింది. మొత్తం 8 సెమిస్టర్స్‌లో తొలి మూడు మినహా మిగిలిన ఐదు సెమిస్టర్స్‌తోపాటు 10 నెలల ఇంటర్న్‌షిప్ చేయిస్తారు. ప్రస్తుతం కంప్యూటర్ సైన్స్, ఈసీఈ, ట్రిపుల్ ఈ, ఐటీ, మెకానికల్ డిగ్రీలలో 66 సీట్ల చొప్పున, సివిల్, మెటలర్జికల్ సబ్జెక్టు డిగ్రీలలో 33 సీట్లు వంతున కోర్సులను స్థానిక జఎన్‌టీయూ ఇంజినీరింగ్ కళాశాల నిర్వహిస్తోంది.
ఏడేళ్లలో 1,071 మందికి ప్లేస్‌మెంట్
ముఖ్యమంత్రి వైఎస్‌రాజశేఖర్‌రెడ్డి పాలన సమయం 2007లో ప్రారంభమైన ఈ కళాశాల ఏడు కోర్సులలో బీటెక్ డిగ్రీని అందిస్తుంది. దినదినాభివృద్ధి చెందుతూ మౌలిక సదుపాయాలు, బోధనా సామర్థ్యాన్ని పెంచుకుంటోంది. గడిచిన ఏడేళ్లలో 1,071 మంది విద్యార్థులకు వివిధ కంపెనీలలో అత్యధికంగా రూ.12 లక్షల వార్షిక వేతన ఉద్యోగాలను ఈ కళాశాల ఇప్పించింది. ప్రస్తుతం నడుస్తున్న విద్యాసంవత్సరం నాలుగో సంవత్సర విద్యార్థులు ఇంతవరకు 180 మంది ఉద్యోగాలు సాధించారు.