Free Computer Training: స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఉచిత కంప్యూటర్ శిక్షణ
కలికిరి: ఉర్దూ అకాడమీ, స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఉచిత కంప్యూటర్ శిక్షణ (డొమెస్టిక్ డేటా ఎంట్రీ ఆపరేటర్) ఇస్తామని కలికిరి ఉర్దూ అకాడమి ట్రైనింగ్ కేంద్రం ఇన్‌చార్జ్ నాజియా అంజుమ్ తెలిపారు. 10వ తరగతి అర్హత కలిగిన మైనారిటీ యువతీ, యువకులు అర్హులని.. ఈ నెల 17వ తేదీ వరకు ఆసక్తి కలిగిన వారు పేర్లు నమోదు చేసుకోచ్చన్నారు. మూడు నెలల పాటు శిక్షణ ఉంటుందని, పూర్తి చేసుకున్న వారికి ధృవీకరణ పత్రం అందజేస్తామన్నారు. అలాగే ఉద్యోగ అవకాశాలు కూడా కల్పిస్తామన్నారు. మరిన్ని వివరాలకు కార్యాలయ పనివేళల్లో 9581321179 నంబరులో సంప్రదించవచ్చన్నారు.
Free Coaching: Group 3 అభ్యర్థులకు ఉచిత శిక్షణ
6న రాష్ట్రస్థాయి సమావేశం
మదనపల్లె: ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ స్కూల్స్ టీచర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆగస్ట్ 6న నెల్లూరులోని అంబేద్కర్‌భవన్‌లో రాష్ట్రస్థాయి సమావేశం నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్ చీఫ్ కో–ఆర్డినేటర్ గుజ్జల ఈశ్వరయ్య తెలిపారు. రాష్ట్రంలోని ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఉపాధ్యాయుల పరిస్థితి చాలా అధ్వానంగా ఉందన్నారు. సమస్యల పరిష్కారం కోసం రాష్ట్రస్థాయి సమావేశంలో చర్చించి భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తామన్నారు.
Mega Job Mela: అప్రెంటిషిప్ కం జాబ్‌మేళా
148 పోస్టులకు గ్రీన్‌సిగ్నల్
వైవీయూ: రాష్ట్ర ప్రభుత్వం విశ్వవిద్యాలయాలు, ట్రిపుల్‌ఐటీల్లో అసిస్టెంట్, అసో సియేట్ ప్రొఫెసర్ పోస్టుల నియామకానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో విశ్వవిద్యాలయ వర్గాల్లో ఆనందం నెలకొంది. రాష్ట్రవ్యాప్తంగా 2635 అధ్యాపక పోస్టులు విశ్వవిద్యాలయాల్లో, 660 పోస్టులు ట్రిపుల్‌ఐటీల్లో మొత్తం మీద 3295 పోస్టులకు నోటిఫికేషన్ జారీచేసేందుకు రంగం సిద్ధమైంది. ఇందులో భాగంగా యోగివేమన విశ్వవిద్యాలయంలో 31 ప్రొఫెసర్ పోస్టులు, 54 అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు, 63 అసిస్టెంట్ ప్రొఫెసర్‌లతో మొత్తం మీద 148 పోస్టులకు గ్రీన్‌సిగ్నల్ లభించినట్లు విశ్వవిద్యాలయ వర్గాలు పేర్కొంటున్నాయి. కాగా, వైవీయూలో చివరిసారిగా 2013లో నియామక నోటిఫికేషన్ ద్వారా ప్రొఫెసర్ పోస్టులు భర్తీ చేశారు.