‘బాసర ట్రిపుల్‌ఐటీలో సీట్ల భర్తీపై అనుమానాలు’
జిల్లా కేంద్రంలో సెప్టెంబర్ 20న ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రత్యేక కేటగిరీ కింద 96 సీట్లను పూర్తిస్థాయిలో భర్తీ చేయక పోవడంతో విద్యార్థులు నష్టపోతున్నారన్నారు. గతేడాది దివ్యాంగుల కోటాలో 35 నుంచి 40 సీట్లు భర్తీ చేసిన అధికారులు ఈ ఏడాది 14 సీట్లు భర్తీ చేసినట్లు యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో పెట్టారని, అందులో ఎంతమంది అడ్మిషన్లు పొందారో స్పష్టం చేయలేదన్నారు.
ఆర్మీ క్రీడాకారుల కోటాలో భర్తీ చేయాల్సిన సీట్లకు రెండు మూడు సార్లు లిస్టులు పెట్టి భర్తీ చేసిన అధికారులు దివ్యాంగులకు చెందిన సీట్లకు ఒక్కసారి లిస్టు ప్రదర్శించి చేతులు దులుపుకోవడం మోసం చేయడమేనన్నారు.
చదవండి:
RGUKT Basara: ‘బాసర’ విద్యార్థుల కోసం ఏఐ యాప్
RGUKT VC: కష్టపడి చదివి ఉన్నత స్థాయికి చేరాలి
RGUKT (IIIT) Basara: సగానికిపైగా తగ్గిన దరఖాస్తులు.. నాలుగేళ్లలో వచ్చిన దరఖాస్తులు ఇలా..