Skip to main content

RGUKT Basara: ‘బాసర’ విద్యార్థుల కోసం ఏఐ యాప్‌

నిర్మల్‌ బాసర ఆర్జీయూకేటీలో విద్యార్థులకు మానసిక, ఆరోగ్య పరిస్థితులకు సంబంధించిన ఆర్ట్ఫీషెయల్‌ ఇంటెలిజెన్స్‌(ఏఐ) బేస్డ్‌ ప్లాట్‌ ఫాం యాప్‌పై అవగాహన కల్పించారు.
RGUKT Basara
‘బాసర’ విద్యార్థుల కోసం ఏఐ యాప్‌

ఇటీవల అక్కడ వరుసగా చోటుచేసుకుంటున్న ఆత్మహత్యల ఘటనలపై ‘ఎందుకలా చనిపోతున్నారు..’శీర్షికన ‘సాక్షి’మెయిన్‌పేజీలో ఆగ‌స్టు 10న‌ ప్రత్యేక కథనాన్ని ప్రచురించి సంగతి తెలిసిందే. ఈమేరకు వర్సిటీ వర్గాలు స్పందించాయి.

ప్రముఖ మానసిక నిపుణులు అమెరికాకు చెందిన డాక్టర్‌ మైక్, బిట్స్‌పిలానీ ప్రొఫెసర్‌ మోహన్‌తో ఆగ‌స్టు 10న‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఇన్‌చార్జి వైస్‌చాన్స్‌లర్‌ వెంకటరమణ ఏఐ యాప్‌పై అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించారు. 

చదవండి: RGUKT VC: కష్టపడి చదివి ఉన్నత స్థాయికి చేరాలి

మానసిక స్థితిపై.. 

విద్యార్థి మానసిక స్థితిని తెలుసుకోవడానికి ఏఐ బేస్డ్‌ యాప్‌ బాగా ఉపయోగపడుతుందని అమెరికా మానసిక నిపుణుడు మైక్‌ అన్నారు. ఈ యాప్‌ ద్వారా అడిగే 17 ప్రశ్నలకు విద్యార్థులు సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుందన్నారు. వారు సమాధానాలు ఇచ్చిన తర్వాత వాటిని నిపుణుల విశ్లేషణ, సంప్రదింపుల తర్వాత విద్యారి్థకి ఏ మోతాదులో మానసిక సహాయం చేయాలనేది నిర్ణయిస్తామన్నారు.

చదవండి: RGUKT (IIIT) Basara: సగానికిపైగా తగ్గిన దరఖాస్తులు.. నాలుగేళ్లలో వచ్చిన దరఖాస్తులు ఇలా..

విశ్లేషణాత్మక డేటా, నిపుణుల అనుభవం ద్వారా వారికి సహాయం అందిస్తామని చెప్పారు. బిట్స్‌ పిలానీ ప్రొఫెసర్‌ మోహన్‌ మాట్లాడుతూ విద్యార్థులకు ఈ యాప్‌ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు.

Published date : 11 Aug 2023 04:52PM

Photo Stories