RGUKT VC: కష్టపడి చదివి ఉన్నత స్థాయికి చేరాలి
ఈ సందర్భంగా ఆయన 2023–24 విద్యాసంవత్సరానికి నూతనంగా ప్రవేశం పొందిన విద్యార్థులకు అభినందనలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఇక్కడి క్యాంపస్‌లో ఆరేళ్లు కష్టపడి చదివితే 60 ఏళ్ల జీవితం హ్యాపీగా గడపవచ్చని పేర్కొన్నారు. ప్రభుత్వం ఒక్కో విద్యార్థిపై ఏడాదికి రూ.2లక్షల మేర ఖర్చు చేస్తోందని చెప్పారు. ఇక్కడ చదివే 9వేల మంది విద్యార్థులకు అన్ని రకాల వసతులు కల్పిస్తున్నామని పేర్కొన్నారు.
చదవండి: నిట్‌తో నాలుగు విద్యాసంస్థల ఎంఓయూ
నూతన ఆవిష్కరణలకు ట్రిపుల్‌ఐటీలో అనేక విధానాలు అవలంభిస్తున్నామని తెలిపారు. పీయూసీ విద్యార్థులకు కంప్యూటర్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నామని, ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు అందిస్తున్నామని వివరించారు.
95శాతం హాజరుకలిగిన విద్యార్థులకు ఎక్సలెన్స్ అవార్డులు అందిస్తామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో నిజామాబాద్‌లో ఏర్పాటు చేసిన హెర్టిహబ్‌లో ట్రిపుల్‌ఐటీ బాసర ఇన్నోవేషన్‌కు కొంత భాగాన్ని కేటాయించినట్లు పేర్కొన్నారు. ట్రిపుల్‌ఐటీలో కోర్సులు, విద్యావిధానం గురించి డైరెక్టర్ సతీశ్‌కుమార్ విద్యార్థులకు వివరించారు.
చదవండి: IIIT: కౌన్సెలింగ్‌కు హాజరు కాని విద్యార్థులకు మరో అవకాశం