Skip to main content

IIIT: కౌన్సెలింగ్‌కు హాజరు కాని విద్యార్థులకు మరో అవకాశం

Another option for students who do not attend counseling

ఎచ్చెర్ల క్యాంపస్‌: శ్రీకాకుళం రాజీవ్‌ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (ట్రిపుల్‌ ఐటీ) ప్రవేశా లకు ఈ నెల 26, 27 తేదీల్లో కౌన్సెలింగ్‌ నిర్వహించారు. 1100 సీట్లకు, ఎన్‌సీసీ, స్పోర్ట్సు అండ్‌ గేమ్స్‌ సీట్లు ప్రకటించలేదు. మొత్తం 1088 మంది విద్యార్థులకు కాల్‌ లెటర్లు పంపించగా, 900 మంది విద్యార్థులు హాజరయ్యారు. 186 మంది హాజరు కాలేదు. హాజరు కాని విద్యార్థులకు మరో అవకాశం కల్పిస్తూ అధికారులు చర్యలు తీసుకున్నారు. ఈ మేరకు రాష్ట్ర చాన్స్‌లల్‌ ప్రొఫెసర్‌ కె.సి.రెడ్డి శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. నాలుగు క్యాంపస్‌లలో (శ్రీకాకుళం, ఇడుపులపాయ, ప్రకాశం, నూజివీడు) మొదటి విడత కౌన్సెలింగ్‌కు హాజరు కాని వారు ఆసక్తి ఉంటే మరోసారి ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. విద్యార్థులు జాబితా డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఆర్‌జీయూకేటీ.ఇన్‌ వెబ్‌ సైట్‌లో అందుబాటులో ఉంచారు. రెండో కౌన్సెలింగ్‌కు హాజరైతే ప్రవేశాలు కల్పిస్తారు. ప్రవేశాలపై ఆసక్తి ఉన్న వారు సైతం పేర్లు నమోదు చేసుకునే అవకాశం కల్పించారు. సీట్లు లభించిన విద్యార్థులు క్యాంపస్‌ మారాలనుకున్నా వెబ్‌సైట్‌లో మార్పు నమోదు చేసుకునే అవకాశం కల్పించారు. క్యాంపస్‌ మారాలనుకునే విద్యార్థులు నమోదు ఆధారంగా సీటు లభించిన క్యాంపస్‌లో సీటు రద్దు, వారు ఆప్షన్‌ ఇచ్చిన క్యాంపస్‌లో సీటు లభిస్తుంది. మార్పు కోరుకునే వారు మొదట సీటు పొందిన క్యాంపస్‌లో ప్రవేశాలు కోల్పోతారు. రిజస్ట్రేషన్‌, క్యాంపస్‌ మార్పు లింక్‌లు ఆగస్టు 1 నుంచి అందుబాటులో ఉంటాయి. ఎంపిక జాబితా ఆగస్టు నాలుగున వెబ్‌సైట్‌లో ఉంటుంది. రెండో విడత కౌన్సెలింగ్‌ ఆగస్టు 9, 10 తేదీల్లో నూజివీడు క్యాంపస్‌లో ఉంటుందని అధికారులు తెలిపారు.

 

IIIT Bhubaneswar: ఐఐఐటీ డైరెక్టర్‌గా ఆశిష్‌ ఘోష్‌

Published date : 29 Jul 2023 03:40PM

Photo Stories