నిట్‌తో నాలుగు విద్యాసంస్థల ఎంఓయూ
Sakshi Education
కాజీపేట అర్బన్ : నిట్ వరంగల్‌తో నాలుగు విద్యా సంస్థలు ఎంఓయూ కుదుర్చుకున్నాయి. న్యూఎడ్యుకేషన్ పాలసీ–2020 మూడో వార్షికోత్సవంలో భాగంగా న్యూఢిల్లీలోని ప్రగతి మైదానంలో ఆగష్టు 1న నిర్వహించిన అఖిల భారతీయ శిక్ష సమాగం–23లో దేశంలోని ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ఎన్‌సీఈఆర్టీ డైరెక్టర్లు పాల్గొన్నారు.
నిట్ డైరెక్టర్ బిద్యాధర్‌సుబుదీ, ఏక్ భారత్ శ్రేష్ట్ భారత్ కోఆర్డినేటర్ శ్రీనివాస్, బీటెక్ విద్యార్థులు రుత్విక్, రేవంత్ పాల్గొని నిట్ విశిష్టతను వివరించారు. ఈ సందర్భంగా నిట్‌తో విశాఖపట్నం ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్, కర్నూలు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, భువనేశ్వర్ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, జమ్మూ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎంఓయూ కుదుర్చుకున్నాయి. విజ్ఞానం, విద్యా వనరుల పరస్పర అవగాహనకు, నూతన ఆవిష్కరణలకు ఎంఓయూ దోహదపడుతుందని నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుదీ తెలిపారు.
చదవండి:
Published date : 02 Aug 2023 04:00PM