జేఎన్‌టీయూలో బయోమెట్రిక్ మూల్యాంకనం
ఇంతకుముందు మూల్యాంకనాన్ని నిర్దేశించిన అధ్యాపకుడే చేస్తున్నాడా లేదా అనేది తెలుసుకొనే అవకాశం ఉండేది కాదు. కానీ ఇప్పుడు మూల్యాంకనం కోసం బయోమెట్రిక్ విధానం ద్వారా రిజిష్ట్రేషన్ చేసుకున్న అధ్యాపకుడు ఇంటర్నెట్ ద్వారా కనెక్ట్ అయ్యాక అతను లైవ్‌లో కనిపిస్తాడు. ఇదంతా సర్వర్‌లో రికార్డు అవుతుంది. అధ్యాపకుడు ఉండే ప్రదేశమంతా 360 డిగ్రీల కోణంలో వీడియో రికార్డు అవుతుంది. దీనివల్ల మూల్యాంకనం ప్రక్రియలో జవాబుదారీతనం పెరగుతుందని JNTUH వీసీ ప్రొఫెసర్ కట్టా నర్సింహారెడ్డి తెలిపారు. ఈ నేపథ్యంలో మూల్యాంకనం కోసం గుర్తించిన అధ్యాపకులు సొంతంగా బయోమెట్రిక్ పరికరాలు కొనుక్కొని కాలేజీ గుర్తింపు కార్డు, పాన్‌కార్డుతో జెన్‌టీయూహెచ్ పరీక్ష విభాగంలో హాజరవ్వాలని అధికారులు సూచించారు. మరోవైపు ఏడేళ్ల కిందట ప్రవేశపెట్టిన ఇంటి నుంచే పేపర్ దిద్దే విధానాన్ని విస్తరించారు. ఇప్పటివరకూ ఇది 30 శాతమే ఉండగా ఇప్పుడు దీన్ని 40 శాతానికి పెంచినట్లు అధికారులు తెలిపారు.
చదవండి: