TS EDCET 2021: మహిళల హవా
Sakshi Education
- ఉత్తీర్ణత శాతం 98.53
ఉపాధ్యాయ కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించిన ఎడ్‌సెట్‌లో 98.53 శాతం మంది అర్హత సాధించారు. వీరిలో మహిళలే ఎక్కువగా ఉన్నారు. ఉస్మానియా వర్సిటీ గత నెలలో ఎడ్‌సెట్ నిర్వహించింది. ఈ పరీక్ష ఫలితాలను ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్. లింబాద్రి శుక్రవారం విడుదల చేశారు. ఎడ్‌సెట్‌కు 42,399 మంది దరఖాస్తు చేసుకోగా, 34,185 మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 33,683 మంది అర్హత సాధించారు. పురుషులు 7,737 మంది పరీక్ష రాస్తే, 7,700 మంది అర్హత సాధించారు. మహిళలు 26,448 మంది రాస్తే 25,983 మంది ఎడ్‌సెట్ అర్హత పొందారు. గతేడాదితో 70 శాతం అర్హత సాధిస్తే... ఈసారి 98.53 శాతం ఉత్తీర్ణత నమోదైందని ఎడ్‌సెట్ కనీ్వనర్ రామ కృష్ణ తెలిపారు.
మొదటి పది ర్యాంకులు వీరికే
పేరు | జిల్లా/ రాష్ట్రం |
తిమ్మశెట్టి మహేందర్ | నల్లగొండ |
అంకపల్లి ప్రత్యూష | మంచిర్యాల |
రిషికే‹Ùకుమార్ శర్మ | బిహార్ |
ఎన్.సమరసింహారెడ్డి | నారాయణపేట్ |
భమిడిపాటి నిఖిల్ | రంగారెడ్డి |
కారమ్ వెంకటే‹Ù | చిత్తూరు (ఏపీ) |
జుఫిషాన్ ఖానమ్ | కరీంనగర్ |
కరణం సుమశ్రీ | మేడ్చల్ |
అరిగల సాయి ప్రణవ్ | హైదరాబాద్ |
అపర్ణ మంగ | హైదరాబాద్ |
Published date : 25 Sep 2021 04:44PM