Skip to main content

AP ECET Results 2022 : ఏపీ ఈసెట్ ఫలితాలు విడుద‌ల‌.. రిజ‌ల్డ్స్ కోసం క్లిక్ చేయండి

సాక్షి ఎడ్యుకేష‌న్‌: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ఈసెట్-2022 ఫలితాలు ఆగ‌స్టు 10వ తేదీన‌ విడుద‌ల చేశారు. జూలై 22వ తేదీ ఉదయం, మధ్యాహ్నం ఈ ప‌రీక్ష‌ను నిర్వహించిన విష‌యం తెల్సిందే. ఈసెట్ ఫ‌లితాల్లో 92.36 శాతం ఉత్తీర్ణత నమోదైంది. బాలికలు 95.68 శాతం, బాలురు 91.44 శాతం ఉత్తీర్ణత సాధించారు. మంగళగిరిలోని ఏపీ ఉన్నత విద్యామండలి కార్యాలయంలో ఉన్నత విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి జె.శ్యామలరావు, ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ కె.హేమచంద్రారెడ్డి ఈ ఫ‌లితాల‌ను విడుదల చేశారు. డిప్లొమా విద్యార్థులకు ఇంజనీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ ప‌రీక్ష‌ను నిర్వ‌హిస్తారు.
AP ECET 2022 Results

ఈ ప‌రీక్షకు 38,741 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఉదయం నిర్వహించిన Electrical Engineering, Agricultural, Civil, Computer Science, Chemical Engineering విభాగాలకు సంబంధించి 17,180 మంది హాజరు కాగా, 1,138 మంది గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం నిర్వహించిన ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌ ఇంజనీరింగ్, ఫార్మసీ, మెటలర్జికల్, ఎలక్ట్రానిక్స్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్, మెకానికల్, మైనింగ్‌ విభాగాలకు సంబంధించి 19,238 మంది హాజరయ్యారు.

ఏపీ ఈసెట్-2022 ఫలితాల కోసం క్లిక్ చేయండి

AP ECET 2022 Results (Click Here)

Best Branch in Engineering : Btechలో బెస్ట్ బ్రాంచ్ ఏది..? ఎలా సెల‌క్ట్ చేసుకోవాలి..?

Engineering college Admissions : ఇంజ‌నీరింగ్‌లో బ్రాంచ్‌కు ప్రాధాన్యమివ్వాలా.. కాలేజీకా..?

Engineering‌ Admissions: బీటెక్‌లో ప్రవేశాలకు సిద్ధమవుతున్నారా... అయితే ఇది మీ కోస‌మే!

Published date : 10 Aug 2022 12:53PM

Photo Stories