Skip to main content

ECET: ఈసెట్ ‘కీ’పై సెప్టెంబర్ 23 వరకు అభ్యంతరాలు స్వీకరణ..

ఇంజినీరింగ్‌ కోర్సుల్లో లేటరల్‌ ఎంట్రీ విధానంలో ప్రవేశాలు కల్పించేందుకు నిర్వహించిన ఏపీ ఈసెట్‌–2021(ఏపీ ఇంజినీరింగ్‌ కామన్‌ ఎంట్రెన్స్ టెస్ట్‌) రాష్ట్ర వ్యాప్తంగా ప్రశాంతంగా ముగిసినట్టు కన్వీనర్‌ ప్రొఫెసర్‌ సి.శశిధర్‌ తెలిపారు.
ECET
ఈసెట్ ‘కీ’పై సెప్టెంబర్ 23 వరకు అభ్యంతరాలు స్వీకరణ..

హైదరాబాద్‌ సహా రాష్ట్రవ్యాప్తంగా 48 కేంద్రాల్లో కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ నిర్వహించారు. మొత్తం 13 బ్రాంచ్‌లలో 34,271 మంది విద్యార్థులకు గాను 32,318 మంది(94.30 శాతం) హాజరయ్యారు. తెలంగాణలో(హైదరాబాద్‌లోని రెండు పరీక్ష కేంద్రాలు) 53.66 శాతం, అనంతపురం జిల్లాలో 96.44, చిత్తూరు 95.30, తూర్పుగోదావరి 96.5, గుంటూరు 94.75, కృష్ణా 94.55, కర్నూలు 96.33, పొట్టిశ్రీరాములు నెల్లూరు 95.82, ప్రకాశం 95.82, శ్రీకాకుళం 94.94, విశాఖపట్నం 96.20, విజయనగరం 94.22, పశ్చిమగోదావరి 94.01, వైఎస్సార్‌ జిల్లాలో 97.52 శాతం హాజరు నమోదైంది. అనంతపురంలోని ఎస్‌ఆర్‌ఐటీ కళాశాల, అనంతలక్ష్మి ఇంజినీరింగ్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాలను ఏపీఈసెట్‌–2021 చైర్మన్‌ ప్రొఫెసర్‌ జింకా రంగజనార్దన తనిఖీ చేశారు. కాగా, సెప్టెంబర్‌ 20న ప్రిలిమినరీ ‘కీ’ని ఏపీ ఈసెట్‌ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతారు. దీనిపై సెప్టెంబర్‌ 23న సాయంత్రం ఐదు గంటల వరకు అభ్యంతరాలు స్వీకరిస్తారు. 

చదవండి: 

టీఎస్ ఈసెట్– 2021 టాపర్లు వీరే.. ఆగస్టు 24 నుంచి ప్రవేశాల కౌన్సెలింగ్..

DEECET: వారం రోజుల్లో డీసెట్ ఫలితాలు

Published date : 20 Sep 2021 12:53PM

Photo Stories