Skip to main content

AP ECET: ప్రశాంతంగా పరీక్ష.. కీ, ఫలితాలు వివరాలు

డిప్లొమా విద్యార్థులకు ఇంజనీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఇంజనీరింగ్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్టు మన రాష్ట్రంతో పాటు తెలంగాణలోని 103 కేంద్రాలలో జూలై 22న ఉదయం, మధ్యాహ్నం నిర్వహించారు.
AP ECET
ప్రశాంతంగా పరీక్ష.. కీ, ఫలితాలు వివరాలు

పరీక్షకు 38,741 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఉదయం నిర్వహించిన Electrical Engineering, Agricultural, Civil, Computer Science, Chemical Engineering విభాగాలకు సంబంధించి 17,180 మంది హాజరు కాగా, 1,138 మంది గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం నిర్వహించిన ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌ ఇంజనీరింగ్, ఫార్మసీ, మెటలర్జికల్, ఎలక్ట్రానిక్స్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్, మెకానికల్, మైనింగ్‌ విభాగాలకు సంబంధించి 19,238 మంది హాజరయ్యారు. పరీక్ష ప్రాథమిక కీ ఈ జూలై 24న విడుదల చేస్తామని, దీనిపై అభ్యంతరాలుంటే జూలై 26వ తేదీ ఉదయం 10 గంటలలోపు సూచించవచ్చని సెట్‌ కన్వీనర్‌ కృష్ణమోహన్‌ సూచించారు. ఫలితాలు ఆగస్టు 6న విడుదల చేస్తామన్నారు. సందేహాలుంటే 0884–2340535 ఫోన్‌ నంబరులో సంప్రదించాలని తెలిపారు.

చదవండి: 

 

Published date : 23 Jul 2022 04:36PM

Photo Stories