టీఎస్ ఈసెట్– 2021 టాపర్లు వీరే.. ఆగస్టు 24 నుంచి ప్రవేశాల కౌన్సెలింగ్..
Sakshi Education
సాక్షి, హైదరాబాద్/సుభా‹Ùనగర్ (నిజామాబాద్ అర్బన్)/కేపీహెచ్బీ కాలనీ: ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఈసెట్) ఫలితాలను రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి బుధవారం విడుదల చేశారు.
పాలిటెక్నిక్ కోర్సులు పూర్తిచేసి, ఇంజనీరింగ్, బీఫార్మసీ రెండో ఏడాదిలో చేరేందుకు ఈ నెల 3న జరిగిన ఈ పరీక్షలో 95.16 శాతం మంది అర్హత సాధించారు. ఈసెట్ కోసం మొత్తం 24,808 మంది దరఖాస్తు చేసుకున్నా.. 23,667 మంది పరీక్ష రాశారు. వీరిలో 22,522 మంది (95.16 శాతం) అర్హత సాధించారు. ఈ నెల 24 నుంచి ఈసెట్ ప్రవేశాల కౌన్సెలింగ్ ప్రక్రియ మొదలవుతుందని, ఆగస్టు 24 నుంచి 28 వరకు స్లాట్ బుకింగ్, ఆగస్టు 26 నుంచి 29 వరకు అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన ఉంటుందని పాపిరెడ్డి తెలిపారు. ఆగస్టు 26 నుంచి 31 వరకు అభ్యర్థులు వెబ్ ఆప్షన్లు ఇవ్వాలని, సెప్టెంబర్ 2న ఈసెట్ అభ్యర్థులకు సీట్లు కేటాయిస్తారని తెలిపారు. సెప్టెంబర్ 2 నుంచి 7 వరకు ఆన్‌లైన్‌లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుందని, సెప్టెంబర్ 13న తుది విడత ప్రవేశాల షెడ్యూలు ప్రారంభం అవుతుందని పేర్కొన్నారు. వచ్చే నెల 14 నుంచి తుది విడత ధ్రువపత్రాల పరిశీలన ఉంటుందని, 14, 15 తేదీల్లో వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పిస్తామని వెల్లడించారు. సెప్టెంబర్ 17న తుది విడత ఈసెట్ సీట్లను కేటాయించనున్నట్లు తెలిపారు. ఆర్థికంగా వెనుబడిన వర్గాలకు (ఈడబ్ల్యూఎస్) రిజర్వేషన్ల అమలు ఉంటుందని చెప్పారు.
చదవండి: బీసీ గురుకులాల్లో ఇంటర్ ప్రవేశాల ప్రక్రియ పూర్తి
చదవండి: స్కూళ్లలో కోవిడ్ ప్రొటోకాల్ తప్పనిసరిగా పాటించాలి: సీఎం వైఎస్ జగన్
చదవండి: క్రిప్టోకరెన్సీ ప్లాట్‌ఫాంలలో భారీ ఉద్యోగావకాశాలు.. వీరికి డిమాండ్ ఎక్కువ..
బాలికలదే స్వల్పంగా పైచేయి
టాపర్స్ వీరే..
చదవండి: బీసీ గురుకులాల్లో ఇంటర్ ప్రవేశాల ప్రక్రియ పూర్తి
చదవండి: స్కూళ్లలో కోవిడ్ ప్రొటోకాల్ తప్పనిసరిగా పాటించాలి: సీఎం వైఎస్ జగన్
చదవండి: క్రిప్టోకరెన్సీ ప్లాట్‌ఫాంలలో భారీ ఉద్యోగావకాశాలు.. వీరికి డిమాండ్ ఎక్కువ..
బాలికలదే స్వల్పంగా పైచేయి
- ఈసెట్ ఫలితాల్లో బాలికల అర్హత శాతమే ఎక్కువగా కనిపిస్తోంది. 16,968 మంది బాలురు ఈసెట్ రాస్తే.. వారిలో 16,095 (94.85 శాతం) మంది అర్హత పొందారు. పరీక్ష రాసిన 6,699 మంది బాలికల్లో 6,427 (95.93 శాతం) అర్హులయ్యారు.
- ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు వందశాతం అర్హత సాధించగా, ఇతర సామాజిక వర్గాల అర్హత శాతం 90 శాతానికి పైగా ఉంది. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ (ఈఈఈ) పరీక్షను అత్యధికంగా 5,141 మంది రాయగా, సివిల్ ఇంజనీరింగ్ కోసం 4,899 మంది రాశారు.
టాపర్స్ వీరే..
- నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం వెంకటాపూర్‌కు చెందిన దాదన్నగారి అనురాగ్‌రావు ఈఈఈ బ్రాంచ్‌లో (142 మార్కులు) స్టేట్ ఫస్ట్ ర్యాంకు సాధించారు.
- నిజామాబాద్ జిల్లా జక్రాన్‌పల్లి మండల కేంద్రానికి చెందిన బొడ్డు అభిజ్ఞ ఈసీఈలో (153) స్టేట్ ఫస్ట్ ర్యాంకు సాధించారు.
- బీఎస్సీ (గణితం)లో మంచిర్యాల జిల్లా జాఫర్‌నగర్‌కు చెందిన మహారాజ్ బేగ్ 110 మార్కులతో మొదటి ర్యాంకు సాధించారు. నిజామాబాద్‌కు చెందిన దరివేముల శ్రీకర్ (105) రెండో ర్యాంకు, కామారెడ్డి జిల్లా బిక్కనూర్‌కు చెందిన యు.రాజేందర్ (93) మూడో ర్యాంకు పొందారు.
- కెమికల్ ఇంజనీరింగ్‌లో రంగారెడ్డి జిల్లాకు చెందిన ఎస్.శివశంకర్ (120), వరంగల్ జిల్లా తొగర్రాయికి చెందిన కట్ల దినేశ్ (114) రెండో ర్యాంకు, కరీంనగర్‌కు చెందిన మేడిశెట్టి శివప్రసాద్ (113) మూడో ర్యాంకు పొందారు.
- పెద్దపల్లి జిల్లా చమన్‌పల్లెకు చెందిన పనస సాయికుమార్ సివిల్ ఇంజనీరింగ్‌లో 160 మార్కులతో ఫస్ట్ ర్యాంకు, సుల్తానాబాద్‌కు చెందిన సాయివర్ధన్ రెండో ర్యాంకు, మందమర్రికి చెందిన కొక్కుల విశ్వాస్ (148) మూడో ర్యాంకు సాధించారు.
Published date : 19 Aug 2021 04:25PM