Skip to main content

TS EAMCET 2023 Ranker Success Story : ఎంసెట్ విజేత‌.. ఎప్ప‌టికైన నా ల‌క్ష్యం ఇదే..

తెలంగాణ ఎంసెట్‌లో ఈసారి ఎక్కువ మంది అమ్మాయిలే అర్హత సాధించారు. ఇదే సమయంలో టాప్‌ ర్యాంకుల్లో అబ్బాయిల హవా కొనసాగింది. అందులోనూ.. ఎంసెట్‌ ఫలితాల్లో కదిరికి చెందిన విద్యార్థులు జయభేరి మోగించి ఉత్తమ ర్యాంకులు సాధించారు.
TS  EAMCET 2023 Ranker Success Story in Telugu
కోలాకులం విజేత

పట్టణానికి చెందిన ఫైజా సమ్రీన్‌ అగ్రికల్చర్‌ అండ్‌ మెడికల్‌ విభాగంలో 60వ ర్యాంకు సాధించింది. ఈమె తండ్రి కదిరి మండలం కేఎన్‌ పాళెం జెడ్పీఉన్నత పాఠశాలలో స్కూల్‌ అసిస్టెంట్‌(ఫిజికల్‌సైన్స్‌) గా పనిచేస్తున్నారు. తల్లి నస్రిన్‌ తలుపుల మండలంలోని ఉర్దూ పాఠశాల ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. ఫైజా సమ్రీన్‌ విజయవాడలో శ్రీ చైతన్య కళాశాలలో ఇంటర్‌ చదివింది. వైద్యురాలిగా సేవలు అందించాలన్నదే లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఫైజా సమ్రీన్‌ పేర్కొంది.

చదవండి: బీటెక్‌లో ఈసీఈతో బంగారు భవిత అందుకోండి.. కెరీర్‌లో దూసుకెళ్లండి..

చదవండి: ఎవర్‌గ్రీన్ సివిల్ ఇంజనీరింగ్.. కెరీర్ అవకాశాలు ఇలా..

స్కూల్‌ అసిస్టెంట్‌గా..
కదిరికి చెందిన కొమ్మ భువనేశ్వర్‌రెడ్డి అగ్రికల్చర్‌ అండ్‌ మెడికల్‌లో 198వ ర్యాంక్‌ సాధించాడు. భువనేశ్వర్‌రెడ్డి విజయవాడలోని శ్రీ చైతన్య జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ పూర్తి చేశాడు. తండ్రి కొమ్మ ఈశ్వర్‌రెడ్డి తనకల్లు మండలం ఈతోడు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో స్కూల్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. తల్లి శ్రీదేవి గృహిణి. గాండ్లపెంట మండలం మునగలవారిపల్లికి చెందిన ఈశ్వర్‌రెడ్డి కదిరి పట్టణంలో నివాసముంటున్నారు.

☛ Engineering‌ Admissions: బీటెక్‌లో ప్రవేశాలకు సిద్ధమవుతున్నారా... అయితే ఇది మీ కోస‌మే!

నా ల‌క్ష్యం ఇదే..
కదిరి వైఎస్సార్‌ నగర్‌కు చెందిన కోలాకులం విజేత అనే విద్యార్థిని అగ్రికల్చర్‌ అండ్‌ మెడికల్‌లో 492వ ర్యాంకు సాధించింది. ఆమె తండ్రి ప్రసాద్‌నాయక్‌.. మిట్టపల్లి జెడ్పీహైస్కూల్‌లో పీడీగా, తల్లి అంజనమ్మ గోరంట్ల మండలం పులేరు హైస్కూల్‌ ఆంగ్ల ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. కోలాకులం విజేత అనంతపురం నగరంలో ఇంటర్‌ చదివింది. పశువైద్యురాలిగా సేవలు అందించాలన్నది తన ధ్యేయమని పేర్కొంది.

TS  EAMCET 2023 ఇంజనీరింగ్‌ స్ట్రీమ్‌లో.. 

పేరు

జిల్లా

1. సనపల అనిరుధ్‌

విశాఖ (ఏపీ)

2. యెక్కంటి ఫణి వెంకట మణిందర్‌రెడ్డి

గుంటూరు (ఏపీ)

3. చల్లా ఉమేశ్‌ వరుణ్‌

నందిగామ, కృష్ణా (ఏపీ)

4. అభినీత్‌ మాజేటి

రంగారెడ్డి (తెలంగాణ)

5. పొన్నతోట ప్రమోద్‌కుమార్‌రెడ్డి

అనంతపురం (ఏపీ)

6. మరడాన ధీరజ్‌కుమార్‌

విశాఖ (ఏపీ)

7. వడ్డే శాన్వితరెడ్డి

నల్గొండ (తెలంగాణ)

8. బోయిన సంజన

శ్రీకాకుళం (ఏపీ)

9. ప్రిన్స్‌ బ్రాన్హంరెడ్డి

నంద్యాల (ఏపీ)

10. మీసాల ప్రణతి శ్రీజ

విజయనగరం (ఏపీ)

TS  EAMCET 2023 అగ్రి, మెడికల్‌ విభాగంలో..

పేరు    

జిల్లా

1. బూరుగుపల్లి సత్యరాజ్‌ జశ్వంత్‌

తూర్పుగోదావరి (ఏపీ)

2. నాసిక వెంకట తేజ

ప్రకాశం (ఏపీ)

3. సఫల్‌లక్ష్మి పసుపులేటి

రంగారెడ్డి (తెలంగాణ)

4. దుర్గెంపూడి కార్తికేయరెడ్డి

గుంటూరు (ఏపీ)

5. బోర వరుణ్‌ చక్రవర్తి

శ్రీకాకుళం (ఏపీ)

6. దేవగుడి గురు శశిధర్‌రెడ్డి

రంగారెడ్డి (తెలంగాణ)

7. వంగీపురం హర్షల్‌ సాయి

నెల్లూరు (ఏపీ)

8. దద్దనాల సాయి చిద్విలాస్‌రెడ్డి

గుంటూరు (ఏపీ)

9. గంధమనేని గిరి వర్షిత

అనంతపురం (ఏపీ)

10. కొల్లాబత్తుల ప్రీతం సిద్ధార్థ్‌

హైదరాబాద్‌ (తెలంగాణ)

Published date : 03 Jun 2023 07:06PM

Photo Stories