Skip to main content

TS EAMCET 2022 Result link : టీఎస్ ఎంసెట్‌ ఫలితాలు విడుద‌ల‌.. రిజ‌ల్డ్స్ డైరెక్ట్ లింక్ ఇదే..

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ ఎంసెట్ ఫ‌లితాలను ఆగ‌స్టు 12వ తేదీన (శుక్ర‌వారం) విడుదల చేశారు.
TS EAMCET 2022
TS EAMCET 2022 Results

ఈ ఫ‌లితాల‌ను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి హైదరాబాద్‌ జేఎన్‌టీయూలో ఉద‌యం 11: 15 గంట‌కు ఫలితాలను విడుదల చేశారు.TS EAMCET Results 2022 కోసం సాక్షి ఎడ్యుకేష‌న్‌.కామ్ (www.sakshieducation.com)లో చూడొచ్చు. 

రాష్ట్రంలోని ఇంజనీరింగ్‌ కళాశాలల్లో ప్రవేశానికి జేఎన్‌టీయూహెచ్ ఈ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (టీఎస్‌ఎంసెట్‌) నిర్వ‌హించింది. ఎంసెట్‌ ఫలితాలు వెలువడిన.. నేప‌థ్యంలో త్వ‌ర‌లోనే ఇంజనీరింగ్‌ కౌన్సెలింగ్‌ ప్రక్రియ మొదలవ్వనుంది. 

➤ టీఎస్ ఎంసెట్‌-2022 (ఇంజనీరింగ్‌) ఫ‌లితాల కోసం క్లిక్ చేయండి

➤ టీఎస్ ఎంసెట్‌-2022 (అగ్రికల్చర్) ఫ‌లితాల కోసం క్లిక్ చేయండి

☛ TS EAMCET-2022 (Engineering) Results 2022 (Click Here)

☛ TS EAMCET-2022 (Agriculture) Results 2022 (Click Here)

Engineering college Admissions : ఇంజ‌నీరింగ్‌లో బ్రాంచ్‌కు ప్రాధాన్యమివ్వాలా.. కాలేజీకా..?

How to check TS EAMCET 2022 Results:
☛ Visit results.sakshieducation.com or sakshieducation.com
☛ Click on TS EAMCET 2022 Results link available on the home page
☛ In the next page, enter your hall ticket no. and click on submit
☛ The results will be displayed on the screen
☛ Save a copy of the marks sheet for further reference

ఈ సారి ఎంసెట్‌కు భారీగానే..
ఇంజనీరింగ్‌ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే TS EAMCET పరీక్ష జూలై 18, 19, 20 తేదీల్లో నిర్వహించిన విష‌యం తెల్సిందే. ఈ మూడు రోజులు జ‌రిగిన ప‌రీక్ష‌ల‌కు తెలంగాణ‌, ఏపీ నుంచి 91 శాతం మంది విద్యార్థులు హాజ‌ర‌య్యారు. ఈసారి సకాలంలోనే నిర్వహించిన‌ ఎంసెట్‌కు భారీగానే పోటీ నెలకొంది. ఈ సారి ఇంజనీరింగ్‌ స్ట్రీమ్‌కు 1,72,243 మంది విద్యార్థులు ద‌ర‌ఖాస్తు చేసుకోక‌.. ప‌రీక్ష‌కు మాత్రం 1,56,812 మంది హాజ‌ర‌య్యారు.  TS EAMCET Keyని కూడా విడుద‌ల చేశారు.

TS EAMCET 2022 Rank Predictor : ఎంసెట్‌-2022 ప‌రీక్ష రాశారా..? మీకు వ‌చ్చే మార్కుల‌కు ఎంత ర్యాంక్ వ‌స్తుందో తెలుసా..?

అగ్రికల్చర్ మాత్రం..
అగ్రికల్చర్, మెడికల్‌ స్ట్రీమ్‌కు 94,150 మంది ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. అగ్రికల్చర్, మెడికల్‌ స్ట్రీమ్‌కు ప‌రీక్ష‌లు మాత్రం జూలై 30, 31వ తేదీల్లో జ‌రిగిన విష‌యం తెల్సిందే. మొత్తంగా 2,66,445 దరఖాస్తులు ఎంసెట్ వ‌చ్చాయి. గత ఏడాదితో పోలిస్తే ఈసారి 14,722 దరఖాస్తులు ఎక్కువగా వచ్చాయి. రెండు రోజుల పాటు జ‌రిగిని 85.3 శాతం మంది విద్యార్థులు హాజరైనట్టు ఎంసెట్ కన్వీన‌ర్‌ ప్రొఫెసర్‌ గోవర్థన్‌ తెలిపారు. పరీక్షకు 80575 మంది హాజరయ్యారు. అగ్రికల్చర్, మెడికల్‌ స్ట్రీమ్ ప‌రీక్ష‌ల‌కు సంబంధించిన కీ కూడా విడుద‌ల చేశారు.

ఇంజనీరింగ్‌:
ఫస్ట్‌ ర్యాంక్‌-లక్ష్మీసాయి లోహిత్‌
సెకండ్‌ ర్యాంక్‌- సాయిదీపిక
థర్డ్‌ ర్యాంక్‌- కార్తికేయ

అగ్రికల్చర్‌:
ఫస్ట్‌ ర్యాంక్‌- నీహ
సెకండ్‌ ర్యాంక్‌-రోహిత్‌
థర్డ్‌ ర్యాంక్‌-తరుణకుమార్‌

టీఎస్ ఎంసెట్‌-2021 (ఇంజ‌నీరింగ్‌) కాలేజ్ & ర్యాంక్‌ ప్రిడిక్ట‌ర్ కోసం క్లిక్ చేయండి

Published date : 12 Aug 2022 05:54PM
PDF

Photo Stories