Skip to main content

AP EAPCET Results 2023 Direct Link : ఏపీ ఈఏపీసెట్‌-2023 ఫలితాలు విడుద‌ల‌.. ఈ సారి టాప్ ర్యాంక‌ర్లు వీరే..

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఏపీ ఈఏపీసెట్-2023 ఫలితాలను విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ జూన్ 14వ తేదీ (బుధ‌వారం) విడుద‌ల చేశారు.
ap eapcet 2023 results telugu news
ap eapcet 2023 results

మే 15 నుంచి 19వ తేదీ వరకు ఇంజినీరింగ్‌ స్ట్రీమ్‌, మే 22, 23 తేదీల్లో అగ్రికల్చర్‌/ఫార్మసీ విభాగాలకు పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. అనంతపురం జేఎన్‌టీయూ-ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పరీక్షలకు తెలుగు రాష్ట్రాల నుంచి  3,38,739 మంది విద్యార్థులు హాజరయ్యారు.  ఇంజ‌నీరింగ్‌కు 224724 మంది ప‌రీక్ష రాశారు. ఇంజ‌నీరింగ్‌లో 76.32 శాతం ఉత్తీర్ణ‌త సాధించారు. అగ్రిక‌ల్చ‌ర్‌లో 90573 ప‌రీక్ష రాయ‌గా.. వీరిలో 81203 మంది అర్హ‌త సాధించారు. అగ్రిక‌ల్చ‌ర్‌లో 89.66 శాతం మంది ఉత్తీర్ణ‌త సాధించారు.

విద్యార్థులు సాధించిన ఇంటర్‌ మార్కులకు 25శాతం చొప్పున వెయిటేజీ కల్పించి ఏపీ ఈఏపీసెట్‌ ర్యాంకులను ప్రకటించారు. ఈ ఫలితాలను www.sakshieducation.com లో చూడొచ్చు. 

➤☛ AP EAMCET Results 2023 ఇంజినీరింగ్‌ విభాగం డైరెక్ట్‌ లింక్‌ ఇదే.. (Click Here)

➤☛ AP EAMCET Results 2023 అగ్రికల్చర్‌/ఫార్మసీ విభాగం డైరెక్ట్‌ లింక్‌ ఇదే.. (Click Here)

How to check AP EAPCET 2023 Results?

క్వాలిపై  అయిన అభ్య‌ర్థులు వీరే..
ఇంజనీరింగ్‌లో మొత్తం 2,24,724 మందికి గానూ 1,71,514 మంది అభ్యర్థులు క్వాలిఫై అయ్యారు. అగ్రికల్చర్‌లో 90,573 మందికి గానూ, 81,203 మంది అభ్యర్థులు క్వాలిపై అయ్యారు. గత నెల 15 నుంచి 23 వరకు జరిగిన ప్రవేశ పరీక్షలకు మొత్తం 3,38,739 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. 3,15,297 మంది పరీక్షలకు హాజరయ్యారు. ఇందులో ఎంపీసీ స్ట్రీమ్‌లో 2,38,180 మందికి గాను 2,24,724 మంది, బైపీసీ స్ట్రీమ్‌లో 1,00,559 మందికి గాను 90,573 మంది పరీక్ష రాశారు. కోవిడ్‌ సమయంలో తొలగించిన ఇంటర్మీడియెట్‌ వెయిటేజ్‌ మార్కులను ఈసారి పరిగణలోకి తీసుకుని ఫలితాలను ప్రకటించారు.

ఇంజనీరింగ్ విభాగంలో చల్ల ఉమేష్ వరుణ్‌కు 158 మార్క్స్‌తో మొదటి ర్యాంక్.. బూరుగుపల్లి సత్య రాజా జస్వంత్ అగ్రికల్చర్, ఫార్మసీ విభాగంలో 153 మార్కులతో మొదటి ర్యాంక్ సాధించాడు.

AP EAMCET 2023 ఫ‌లితాల పూర్తి వివ‌రాలు ఇవే..
 

Published date : 14 Jun 2023 11:52AM
PDF

Photo Stories