EAMCET Counselling : నవంబర్ 20 నుంచి ప్రత్యేక కౌన్సెలింగ్..సీట్లు పొందిన విద్యార్థులు..
Sakshi Education
సాక్షి, ఎడ్యుకేషన్: తెలగాణలో రెండో దశలో సీట్లు పొందిన విద్యార్థులు నవంబర్ 15లోగా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది.
వచ్చిన సీటును రద్దు చేసుకొనేందుకు నవంబర్ 18 వరకు అవకాశం ఇచ్చారు. ఈలోగా సీటు రద్దు చేసుకున్న వారికి చెల్లించిన ఫీజులో 50 శాతం వెనక్కి ఇస్తారు. గడువు తర్వాత రద్దు చేసుకుంటే ఎలాంటి ఫీజు తిరిగి ఇవ్వరు. ప్రస్తుతం భర్తీకాని సీట్లు, రెండో దశలో ఖాళీగా మిగిలే సీట్లను పరిగణలోకి తీసుకొని నవంబర్ 20 నుంచి ప్రత్యేక రౌండ్ సీట్ల కేటాయింపు చేపడతారు. సీటు పొందిన అభ్యర్థులకు ఇప్పటికే వారి రిజిస్టర్డ్ మొబైల్‌కు సంక్షిప్త సందేశం పంపారు. వివిధ కారణాల చేత 1,861 మంది ఆప్షన్స్ ఇచ్చి నా సీట్లు కేటాయించలేదు. ఈ ఏడాది ఇప్పటివరకు ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు (ఈడబ్ల్యూఎస్ కోటా) 4,973 సీట్లు కేటాయించారు.
Engineering : ఇంజనీరింగ్‌లో సీట్లు కేటాయింపు...ఈ కోర్సులకే క్రేజ్ ఎక్కువ..
తెలంగాణలోని ఇంజనీరింగ్ కాలేజీలు మొత్తం | 175 |
ఎంసెట్ అర్హత సాధించిన వారు | 1,21,480 |
ధ్రువపత్రాల పరిశీలనకు హాజరైన వారు(1, 2 దఫాలకు కలిపి) | 73,428 |
రెండో కౌన్సెలింగ్‌లో ఆప్షన్లు ఇచ్చిన వాళ్లు | 42,310 |
మొత్తం ఆప్షన్లు | 16,39,716 |
కన్వీనర్ సీట్లు | 79,790 |
మొదటి దశలో వచ్చిన సీట్లలో జాయిన్ అయిన వాళ్లు | 45,062 |
రెండో దశలో సీట్ల ఖాళీలు | 39,154 |
రెండో దశ తర్వాత కూడా భర్తీ చేయాల్సిన సీట్లు | 19,797 |
Published date : 13 Nov 2021 03:12PM