Engineering : ఇంజనీరింగ్‌లో సీట్లు కేటాయింపు...ఈ కోర్సులకే క్రేజ్ ఎక్కువ..
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో నవంబర్ 12వ తేదీన జరిగిన రెండో దశ ఇంజనీరింగ్ సీట్ల కేటాయింపులో కన్వీనర్ కోటా కింద 75.18 శాతం సీట్లు కేటాయించినట్లు సాంకేతిక విద్య కమిషనర్ నవీన్ మిట్టల్ తెలిపారు.
రాష్ట్రంలో మొత్తం 79,790 ఇంజనీరింగ్ సీట్లు ఉంటే ఇప్పటివరకు 59,993 సీట్ల కేటాయింపు పూర్తయింది. ఇంకా 19,797 సీట్లు మిగిలిపోయాయి. రెండో విడత కౌన్సెలింగ్‌లో పాల్గొన్న వారిలోనూ చాలా మంది కంప్యూటర్ సైన్స్ సహా కొత్త కోర్సులకే ప్రాధాన్యమిచ్చారు. దీంతో కంప్యూటర్ సైన్స్ సీట్లు హాట్ కేకుల్లా భర్తీ అయ్యాయి. సివిల్, మెకానికల్ సీట్లకు తక్కువ ఆప్షన్లు ఇవ్వడంతో ఎక్కువగా మిగిలిపోయాయి. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ (సీఎస్‌ఈ) సీట్లను 95.98 శాతం కేటాయించగా మెకానికల్ ఇంజనీరింగ్‌లో కేవలం 32.57 శాతమే సీట్లు భర్తీ అయ్యాయి. సివిల్ ఇంజనీరింగ్‌కు కూడా విద్యార్థులు పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో 41.87 శాతమే సీట్ల కేటాయింపు జరిగింది.
తెలంగాణలోని ఇంజనీరింగ్ కాలేజీలు మొత్తం | 175 |
ఎంసెట్ అర్హత సాధించిన వారు | 1,21,480 |
ధ్రువపత్రాల పరిశీలనకు హాజరైన వారు(1, 2 దఫాలకు కలిపి) | 73,428 |
రెండో కౌన్సెలింగ్‌లో ఆప్షన్లు ఇచ్చిన వాళ్లు | 42,310 |
మొత్తం ఆప్షన్లు | 16,39,716 |
కన్వీనర్ సీట్లు | 79,790 |
మొదటి దశలో వచ్చిన సీట్లలో జాయిన్ అయిన వాళ్లు | 45,062 |
రెండో దశలో సీట్ల ఖాళీలు | 39,154 |
రెండో దశ తర్వాత కూడా భర్తీ చేయాల్సిన సీట్లు | 19,797 |
Published date : 13 Nov 2021 02:46PM