అగ్రికల్చర్ ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ తేదీలు ఇవే..
![Agriculture Engineering Counseling](/sites/default/files/images/2023/07/26/counselling3-1690359148.jpg)
Prof Jayashankar Agricultural University ద్వారా పాలిటెక్నిక్, విశ్వవిద్యాలయం ద్వారా గుర్తింపు పొందిన ప్రైవేటు పాలిటెక్నిక్‌లో రెండేళ్ల వ్యవసాయ, సేంద్రియ వ్యవసాయ డిప్లొమా కోర్సులకు, మూడేళ్ల డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ కోర్సులకు 2022–2023లో ప్రవేశం కోసం ఆగస్టు 29 నుంచి సెప్టెంబర్ 3 వరకు కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ సుధీర్‌కుమార్ తెలిపారు. సీట్ల కేటాయింపు పాలిసెట్–2022 ర్యాంకులు, రిజర్వేషన్ నిబంధనల ప్రకారం జరుగుతుందని వెల్లడించారు. మెరిట్ లిస్టు, కౌన్సెలింగ్, షెడ్యూల్, సర్టిఫికెట్లు, ఫీజు తదితర వివరాల కోసం విశ్వవిద్యాలయం వైబ్‌సైట్ https://pjtsau.edu.in/admission.htmlను సందర్శించాలని సూచించారు. అభ్యర్థులు కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను చూసి వారి ర్యాంకులు ప్రకారంగా కౌన్సెలింగ్‌కు హాజరుకావాలని తెలిపారు.
చదవండి: