Good News For Vidya Volunteers : విద్యావాలంటీర్లకు గుడ్‌న్యూస్.. మెగా డీఎస్సీకి..
డీఎస్సీ నోటిఫికేషన్ కోసం ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. మెగా డీఎస్సీ కోసం సత్వరమే చర్యలు తీసుకోవాలనీ.., ఈ ప్రక్రియ పూర్తయ్యే వరకూ విద్యావాలంటీర్లను రెన్యువల్ చేయాలంటూ టీపీసీసీ సీనియర్ అధికార ప్రతినిధి రియాజ్, పీసీసీ మీడియా కో-ఆర్డినేటర్ కమలాకర్, టీవీవీఎస్ వ్యవస్థాపకులు, డీఎస్సీ అభ్యర్థుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మఠం శివానంద స్వామి జనవరి 24వ తేదీన (బుధవారం) బుర్రా వెంకటేశంను కలిసి విజ్ఞప్తి చేశారు. సార్వత్రిక ఎన్నికల్లోపు డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేయాలని కోరారు. పర్సెంటేజ్ నిబంధనతో చాలామంది అభ్యర్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనీ, ఆ సమస్య లేకుండా నోటిఫికేషన్ ఇవ్వాలని సూచించారు.
వీలైనన్ని అధిక సంఖ్యలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్ కోసం చర్యలు తీసుకుంటున్నామని ఆయన హామీ ఇచ్చారని తెలిపారు. త్వరలోనే అనుబంధ నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారని పేర్కొన్నారు.
టీచర్ కొలువుకు తొలిమెట్టు.. టెట్‌లో అర్హత సాధించే ప్రణాళిక ఇదిగో..!
తెలంగాణలో ప్రభుత్వ టీచర్ ఉద్యోగాల భర్తీకి ఆలస్యం అయ్యేలా కనిపిస్తోంది. కనుగ తెలంగాణ ప్రభుత్వ స్కూల్స్‌లో వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం రోజు నుంచే విద్యా వాలంటీర్స్ అందుబాటులో ఉంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఇందుకోసం ప్రస్తుత ఖాళీల ప్రకారం దాదాపు 15 వేల మందిని నియమించే అవకాశం ఉంది.
జూన్ 11వ తేదీ నాటికి..
ఒక్క ఖాళీ లేకుండా విద్యా వాలంటీర్లను భర్తీ చేయాలని ఇటీవల ప్రభుత్వం విద్యాశాఖను ఆదేశించింది. డీఎస్సీ ద్వారా శాశ్వత ఉపాధ్యాయుల నియామకానికి 6 నుంచి 9 నెలల సమయం పడుతుందన్న అంచనా నేపథ్యంలో జూన్ 11వ తేదీ నాటికి విద్యా వాలంటీర్ల ఎంపికను పూర్తి చేయాలని భావిస్తున్నారు. శాశ్వత ఉపాధ్యాయులు విధుల్లో చేరే వరకు విద్యా వాలంటీర్లు పనిచేయనున్నారు.
నెలకు రూ.15000 నుంచి రూ.20000 మధ్యలో జీతం..?
గతంలో పాఠశాలల పునఃప్రారంభం తర్వాత ఎంపిక ప్రక్రియ మొదలయ్యేది. దానివల్ల 15-30 రోజులపాటు బోధన కుంటుపడేది. ఈ సారి ఎలాంటి ఆటంకాలు లేకుండా ముందుగానే.. విద్యా వాలంటీర్ల ఉద్యోగాలను నియమించుకోనున్నారు. నాలుగేళ్ల క్రితం వరకు వీరికి నెలకు రూ.12 వేల చొప్పున గౌరవ వేతనం చెల్లించారు. ఈ సారి విద్యా వాలంటీర్లు రెవంత్‌రెడ్డి సర్కార్ రూ.15000 నుంచి రూ.20000 మధ్యలో జీతం ఇచ్చే అవకాశం ఉంది.
Tags
- vidya volunteers renewal
- ts vidya volunteers renewal 2024 news telugu
- vidya volunteers latest news telugu
- vidya volunteers renewal news telugu
- ts vidya volunteers 2024 update news
- vidya volunteers notification 2024
- telangana vidya volunteers recruitment process
- TS Mega DSC 2024
- TS Mega DSC Notification 2024
- TS Mega DSC Notification News in Telugu
- ts mega dsc latest videos
- ts mega dsc 2024 live updates
- ts mega dsc 2024 february
- Education Volunteers
- Telangana Education Updates
- Academic Year Renewal
- Sakshi Education News
- Burra Venkatesham Statement
- Principal Secretary Announcement