DSC 2024 : డీఎస్సీ అభ్యర్థులకు అలర్ట్..
గతంలో తమ సొంత జిల్లాల్లో పోస్టులు లేకపోవడంతో చాలా మంది ఇతర జిల్లాల్లో ఓపెన్ కోటా ఉద్యోగాల కోసం దరఖాస్తులు సమర్పించారు. తాజాగా 11,062 పోస్టులతో మెగా డీఎస్సీని ప్రకటించడంతో కొన్ని జిల్లాల్లో పోస్టుల సంఖ్య పెరిగింది. వారు కొత్తగా దరఖాస్తు చేసుకోవడానికి ప్రయత్నిస్తే ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నట్టుగా చూపిస్తున్నది.
ఈ నేపథ్యంలో ఎడిట్ ఆప్షన్ ఇవ్వాలని అభ్యర్థులు కోరగా.. విద్యాశాఖ ఈ అవకాశాన్నిస్తూ వెబ్‌సైట్‌లో మార్పులు చేసింది. కావునా గతంలో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు నూతన పోస్టులను బట్టి వేరే జిల్లాలలో కూడా ఎడిట్ ఆఫ్షన్ ద్వారా దరఖాస్తులో మార్పులు చేసుకోవచ్చు.
☛ టీఎస్ డీఎస్సీ-2024 దరఖాస్తును ఎడిట్ కోసం క్లిక్ చేయండి
నియామక విధానం ఇలా..
రాత పరీక్షకు 80 మార్కులుంటాయి. టెట్ వెయిటేజ్ 20 శాతం ఉంటుంది. టీఎస్, ఏపీ టెట్, కేంద్ర టెట్‌లను పరిగణనలోనికి తీసుకుంటారు. స్కూల్ అసిస్టెంట్ పోస్టుకు దరఖాస్తు చేసే వారు యూజీసీ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి 50% మార్కులతో (ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 45%) డిగ్రీ ఉండాలి. బీఈడీ ఉత్తీర్ణులై ఉండాలి. ఆఖరి సంవత్సరం బీఈడీ అభ్యర్థులు నియామకం జరిగే నాటికి సర్టిఫికెట్ పొంది ఉండాలి. టెట్ పేపర్ 2 ఉత్తీర్ణులై ఉండాలి. భాషా పండితులు, పీఈటీలు, సబ్జెక్టు టీచర్లు ఆయా సబ్జెక్టులతో బీఈడీ చేసి ఉండాలి.
ఎస్‌జీటీ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థులు..
ఎస్‌జీటీ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థులు 50% మార్కులతో ఇంటర్మిడియెట్ (రిజర్వేషన్ అభ్యర్థులకు 40%) పూర్తి చేసి ఉండాలి. రెండేళ్ల కాలపరిమితి గల డీఎడ్, నాలుగేళ్ల స్పెషల్ ఎడ్యుకేషన్ చేసి ఉండాలి. పేపర్–1 టెట్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. భాషా పండితులు, పీఈటీలు సంబంధిత సబ్జెక్టుల్లో డీఎడ్ చేయాలి.