Skip to main content

Father And Son Get Teacher Job Success Story : తండ్రీ కొడుకు ఒకేసారి టీచ‌ర్ ఉద్యోగాలు కొట్టారిలా.. కానీ వీరి కుటుంబం అంతా కూడా...

తెలంగాణ ప్ర‌భుత్వం ఇటీవ‌లే విడుద‌ల చేసిన డీఎస్సీ ఫ‌లితాల్లో ఎంతో మంది త‌మ కుటుంబ స‌భ్యులే ఉద్యోగాలు సాధించారు. భార్య‌భ‌ర్త ఒకేసారి సాధించారు. అలాగే అన్న‌ద‌మ్ములు కూడా ఒకేసారి సాధించారు.
Father And Son Get Government Teacher Job

అయితే ఇక్క‌డ ఒక్క విచిత్రం ఏమిటంటే...తండ్రీ కొడుకు ఒకే సారి.. ప్ర‌భుత్వ‌ టీచ‌ర్ ఉద్యోగాలను కొట్టారు. వీరే తెలంగాణ‌లోని నారాయణ పేట జిల్లా మరికల్ మండలం రాకొండకు చెందిన తండ్రి గోపాల్, కొడుకు భాను ప్రకాశ్‌‌. ఈ నేప‌థ్యంలో ఈ తండ్రికొడుకుల స‌క్సెస్ స్టోరీ మీకోసం...

కుటుంబ నేప‌థ్యం :
గోపాల్, విజయలక్ష్మి దంపతులకు ఇద్దరు కుమారులు. వీరు జడ్చర్లలో స్థిరపడ్డారు. భార్య విజయలక్ష్మి ఇది వరకే తెలుగు పండిట్‌‌గా ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నారు. రెండు నెలల కింద వారి రెండో కొడుకు చంద్రకాంత్‌‌ ఏఈఈ ఉద్యోగం సాధించాడు. మొదటి కొడుకు భానుప్రకాశ్‌‌ ప్రస్తుతం స్కూల్‌‌ అసిస్టెంట్‌‌లో 9వ ర్యాంకు సాధించాడు.

☛➤ TG DSC 2024 Toppers Success Stories : కానిస్టేబుల్​గా ఉద్యోగం చేస్తూనే.. టీచ‌ర్ ఉద్యోగం సాధించాం ఇలా.. కుటుంబ పోషణ కోసం..

తండ్రికే మొద‌టి ర్యాంక్‌..

 Both Father And Son Get Teacher Job in DSC 2024

తెలంగాణ డీఎస్సీ ఫలితాల్లో తండ్రి కొడుకులకు స్కూల్‌‌ అసిస్టెంట్‌‌ ఉద్యోగాల్లో ర్యాంకులు వచ్చాయి. నారాయణ పేట జిల్లా మరికల్ మండలం రాకొండకు చెందిన తండ్రి గోపాల్ తెలుగు పండిట్‌‌గా జిల్లాలో మొదటి ర్యాంక్ సాధించాడు. గోపాల్ 50 సంవ‌త్స‌రాల వ‌య‌స్సులో ఈ ర్యాంక్ సాధించాడు. గోపాల్ ఎంఏ, బీఈడీ చ‌దివారు. గోపాల్ కుటుంబ పోష‌న కోసం నాయినీ బ్రాహ్మ‌ణుడిగా కులవృత్తి చేశాడు. ఆర్థిక ప‌రిస్థితుల కార‌ణంగా.. ఎన్నో స‌మస్య‌లు ఎదుర్కొన్నారు. కేవ‌లం ఒక నెల వ్య‌వ‌ధిలోనే ప‌గ‌లురాత్ర‌లు క‌ష్ట‌ప‌డి చ‌దివి.. డీఎస్సీ ఉద్యోగం సాధించారు.

 Join our WhatsApp Channel (Click Here)

 Join our Telegram Channel (Click Here)

చాలా పోటీప‌రీక్ష‌ల్లో ఫెయిలైన కూడా..

Father And Son Get Teacher Jobs News in Telugu

కొడుకు భాను ప్రకాశ్ డీఎస్సీ మ్యాథ్స్‌‌ సబ్జెక్ట్‌‌లో మొద‌టి ప్ర‌య‌త్నంలోనే 9వ ర్యాంక్ సాధించారు.  భాను ప్రకాశ్ బీఎస్సీ, బీఈడీ పూర్తి చేశారు. భాను మూడు సంవత్స‌రాల నుంచి పోటీప‌రీక్ష‌ల‌కు ప్రిపేర్ అవుతున్నాడు. ఆన్‌లైన్ ద్వారా కోచింగ్ తీసుకోని.. తండ్రి కొడుకు ఒక్క‌రిక్కొరు స‌బ్జెక్ట్ డిష‌క‌ష‌న్ చేసుకుంటూ.. ఈ డీఎస్సీకి ప్రిపేర్ అయ్యారు. మేము సొంతంగానే నోట్స్ ప్రిపేర్ చేసుకున్నాము. భాను చాలా పోటీప‌రీక్ష‌ల్లో ఫెయిలైన మాత్రం.. ప్రిప‌రేష‌న్ మాత్ర‌మ ఆప‌లేదు. చివ‌రికి అనుకున్న డీఎస్సీలో ఉద్యోగం సాధించి అంద‌రితో శ‌భాస్ అనుకున్నాడు.

Follow our YouTube Channel (Click Here)

అంద‌రు ప్ర‌భుత్వ బడుల్లోనే చ‌దువు..
గోపాల్‌‌ ఇంట్లో అందరూ ప్రభుత్వ ఉద్యోగులు కావడం గమనార్హం. వీరు క‌ఠిన పేద‌రికం నుంచి.. నేడు ఈ స్థాయికి వ‌చ్చారు. తండ్రికొడుకులు డీఎస్సీలో మంచి ర్యాంక్​ తెచ్చుకోవడం పట్ల గ్రామస్తులు వీరిని అభినందిస్తున్నారు. అలాగే వీరు అంద‌రు ప్ర‌భుత్వ స్కూల్స్‌లోనే చ‌దివి.. నేడు ఈ స్థాయికి వ‌చ్చారు.

Published date : 03 Oct 2024 10:53AM

Photo Stories