New Teachers: కొత్త టీచర్లు ఎలా ఉన్నారు?.. విద్యాశాఖ ఆరా!

క్షేత్రస్థాయి నివేదికలు ఇవ్వాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్ జిల్లా విద్యాశాఖాధికారులను కోరింది. దీంతో డీఈవోలు ఈ బాధ్యతను మండల విద్యాశాఖ అధికారులకు అప్పగించారు.
ఈ నేపథ్యంలో కొన్ని ప్రత్యేక అంశాలను ఎంఈవోలకు సూచించారు. ఇటీవల డీఎస్సీ ద్వారా 11,062 మందికి టీచర్ పోస్టులు వచ్చాయి.
ఇందులో చాలామందిని ఏకోపాధ్యాయ పాఠశాలల్లోనే నియమించారు. కొత్తగా చేరినవారి బోధనా సరళి ఏ విధంగా ఉంది? విద్యార్థులతో ఎలా మమేకమవుతున్నారు? స మస్యలు వస్తున్నాయా? ఏమేరకు చొరవ చూపుతున్నారు? అనే అంశాలపై ప్రధా నంగా నివేదిక కోరారు.
చదవండి: Screening Test for Free DSC Training: ఉచిత డీఎస్సీ శిక్షణకు స్క్రీనింగ్ టెస్ట్
దీంతోపాటు పాలనాపరమైన విధులు, విద్యాశాఖ నిబంధనావళిని ఎంతవరకు పాటిస్తున్నారనే అంశాలను పరిశీలిస్తున్నారు.
ఎంపికైన టీచర్లకు ముందుగా శిక్షణ ఇవ్వాలని అధికారులు భావించినప్పటికీ అది సాధ్యంకాలేదు. ముందుగా రిసోర్స్ పర్సన్స్‌ను ని యమించి, వారి ద్వారా శిక్షణ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు పాఠశాల విద్య అధికారులు తెలిపారు. ఈలోగా వారి బోధన విధానాన్ని నిశితంగా పరిశీలిస్తే మరింత ప్రయోజనం ఉంటుందని, ఆయా అంశాలను కూడా శిక్షణలో జోడించే వీలుందని ఓ సీనియర్ అధికారి తెలిపారు.