Skills University: స్కిల్స్ యూనివర్సిటీకి ‘ఈ సంస్థ’ రూ.200 కోట్లు కేటాయింపు
యూనివర్సిటీ భవన సముదాయం నిర్మాణం కోసం సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్) నిధుల నుంచి రూ.200 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించింది. ప్రపంచ స్థాయి లో అధునాతన వసతులు ఉండేలా మేఘా సంస్థ యూనివర్సిటీ భవనాలను నిర్మి స్తుంది.
ఈ మేర కు శనివారం సీఎం రేవంత్ రెడ్డితో ‘మేఘా’ఎండీ కృష్ణారెడ్డితో పాటు సంస్థ ప్రతినిధుల బృందం సచివాలయంలో సంప్రదింపులు జరిపింది. ముఖ్యమంత్రితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్ర మార్క, మంత్రులు శ్రీధర్‌బాబు, ఉత్తమ్‌కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీ అనిల్ కుమార్‌యాదవ్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. అకడమిక్ బిల్డింగ్, వర్క్ షాపులు, తరగతి గదులతో పాటు హాస్టల్ భవనాలు నిర్మిస్తామని కంపెనీ ఎండీ కృష్ణారెడ్డి తెలిపారు. ఇప్పటికే ఆర్కిటెక్ట్‌లతో తయారు చేయించిన యూనివర్సిటీ భవన నిర్మాణ నమూ నాలను, డిజైన్లను ఈ సమావేశంలో ప్రదర్శించారు.
చదవండి: Skills University: ‘స్కిల్స్’ తొలి నోటిఫికేషన్.. మొదటి విడతలో నాలుగు కోర్సులు ఇవే..
వారం రోజుల్లోగా భవన డిజైన్లకు తుది రూపు ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సూచించారు. నవంబర్ 8వ తేదీ నుంచి వర్సిటీ భవనాల నిర్మాణ పనులు ప్రారంభించేలా ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రభుత్వం తరఫున అవసరమైన సహకారం అందిస్తామని భరోసా ఇచ్చారు. ఈ నేపథ్యంలో యూనివర్సిటీ భవనాల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వంతో మేఘా సంస్థ శనివారం అవగాహన ఒప్పందం (ఎంవోయూ) చేసుకుంది.
▶ Join our WhatsApp Channel: Click Here ▶ Join our Telegram Channel: Click Here |
▶ Follow our YouTube Channel: Click Here ▶ Follow our Instagram Page: Click Here |
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్, యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ వీఎల్వీఎస్‌ఎస్ సుబ్బారావు సమక్షంలో ఎంవోయూపై సంతకాలు జరిగాయి. హైదరాబాద్ శివారులోని కందుకూరు మండలం మీర్‌ఖాన్‌పేటలో 57 ఎకరాల విస్తీర్ణంలో యూనివర్సిటీ నిర్మాణానికి సీఎం రేవంత్ ఇటీవల భూమి పూజ చేసిన సంగతి తెలిసిందే.
Tags
- Young India Skills University
- Megha Engineering & Infrastructures Ltd
- corporate social responsibility
- MEIL
- Chief Minister Revanth Reddy
- Managing Director Krishna Reddy
- Deputy Chief Minister Bhatti Vikramarka
- MEIL to Sponsor 200 Cr to Build YISU
- Megha to Construct Skill Varsity Buildings
- Memorandum of Understanding
- Telangana News