Skip to main content

DSC 2024: ఉర్దూ స్పెషల్‌ డీఎస్సీ ప్రకటించాలి

సాక్షి, సిటీబ్యూరో: డీఎస్సీ–2024 ఉర్దూ మీడియం బ్యాక్‌లాగ్‌ పోస్టుల భర్తీకి ఉర్దూ స్పెషల్‌ డీఎస్సీ ప్రకటించాలని ఉర్దూ ట్రైనీ టీచర్స్‌ ప్రభుత్వానికి డిమాండ్‌ చేశారు.
Urdu Special DSC should be announced   demanding Urdu Special DSC for backlog posts

అక్టోబర్ 23న గాంధీభవన్‌లో ప్రజాపాలన–మంత్రులతో ముఖాముఖి కార్యక్రమానికి హాజరైన మంత్రి శ్రీధర్‌ బాబును కలిసి తమ గోడు వినిపించారు. ఉపాధ్యాయ పోస్టుల భర్తీలో రిజర్వేషన్‌ కేటగిరిలో అర్హులైన అభ్యర్థులు లేక మిగిలిపోయిన పోస్టులను జనరల్‌ కేటగిరికి కేటాయించి తిరిగి నోటీఫికేషన్‌ ద్వారా భర్తీ చేయాలని విజ్ఞప్తి చేశారు.

చదవండి: Dsc Free Coaching : డీఎస్సీ ప‌రీక్ష‌లు.. ఉచిత కోచింగ్‌కు ద‌రఖాస్తులు

ప్రతిసారి డీఎస్సీ నోటీఫికేషనన్‌ జారీ అవుతున్నా రిజర్వేషన్‌ కేటగిరి పోస్టులు అత్యధికంగా బ్యాక్‌లాగ్‌ కింద పడిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సారి కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్‌ కేటగిరిలో పెద్ద ఎత్తున పోస్టులు అర్హులైన అభ్యర్ధులు లేక బ్యాక్‌లాగ్‌గా మారాయన్నారు.

Join our WhatsApp Channel: Click Here
Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here

డీఎస్సీ రిక్రూట్‌మెంట్‌ ప్రక్రియలో ఉర్దూ మాట్లాడేవారికి న్యాయమైన ప్రాతినిధ్యం కల్పించాలన్నారు. దీనిపై మంత్రి శ్రీధర్‌బాబు సానుకూలంగా స్పందించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హమీ ఇచ్చారు. అంతకు ముందు గాంధీభవన్‌లో ప్లే కార్డులు చేతభూని ఉర్దూ ట్రైనీ టీచర్స్‌ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

Published date : 24 Oct 2024 12:42PM

Photo Stories