Dsc Free Coaching : డీఎస్సీ పరీక్షలు.. ఉచిత కోచింగ్‌కు దరఖాస్తులు
Sakshi Education
నంద్యాల: డీఎస్సీ విద్యార్థులకు శిక్షణ ఇచ్చేందుకు కోచింగ్ సెంటర్ల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా షెడ్యూల్ కులాల సంక్షేమం, సాధికారత అధికారిణి చింతామణి సోమవారం ఒక ప్రటకనలో పేర్కొన్నారు. సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖలు, ఏపీ ప్రభుత్వం సంయుక్తంగా 5,050 ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఉచితంగా డీఎస్సీ శిక్షణ ఇచ్చేందుకు చర్యలు తీసుకున్నాయన్నారు. రెండు డీఎస్సీ రిక్రూట్‌మెంట్లకు కోచింగ్ ఇచ్చి ఉండి, రిక్రూట్ మెంట్‌లో కనీసం 100 మంది అభ్యర్థులకు ఉద్యోగాలు వచ్చివున్న కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు ఈనెల 25లోగా https://jnanabhumi.ap.gov.in/ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
Published date : 23 Oct 2024 09:08AM