Skip to main content

TS DSC 2023 Notification: తెలంగాణలో డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలోని నిరుద్యోగులకు కేసీఆర్‌ సర్కార్‌ గుడ్‌న్యూస్‌ చెప్పింది. డీఎస్సీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 5089 టీచర్ల పోస్టుల భర్తీకి విద్యాశాఖ నోటిఫికేషన్‌ జారీ చేసింది.
TS DSC 2023 Notification,5089 Teacher Vacancies in Telangana
తెలంగాణలో డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల

TS DSC Notification 2023: ఖాళీల వివ‌రాలు ఇలా..

ద‌ర‌ఖాస్తు, వ‌యోప‌రిమితి, సిల‌బ‌స్‌, ప‌రీక్షావిధానం వివ‌రాలు ఇవే..

స్కూల్ అసిస్టెంట్ (SA) 1739
సెకండరీ గ్రేడ్ టీచర్లు 2575
భాష పండితులు 621
పీఈటీలు 164
స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్లు ప్రాథమిక పాఠశాలలో 796 
ప్రాథమికోన్నత పాఠశాలలు 727

చదవండి: DSCలో కొత్త Subject ఇదే.. Scoring subject ఏదంటే! #sakshieducation

TS DSC Notification 2023: ముఖ్య‌మైన తేదీలు ఇవే.. 

  • ద‌ర‌ఖాస్తులు:సెప్టెంబ‌ర్‌ 20వ తేదీ నుంచి అక్టోబర్ 21వ తేదీ వరకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించనుంది. 
  • ప‌రీక్ష తేదీ: నవంబర్‌ 20 నుంచి 30 వరకు పరీక్షలను నిర్వహించనున్నారు.

ద‌ర‌ఖాస్తు ఫీజు: అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.1000 చెల్లించాల్సి ఉంటుంది. 

అభ్యర్థుల వయస్సు ఆగస్టు 1వ తేదీ నాటికి 18-44 ఏళ్లు ఉండాలి.

చదవండి: TS DSC 2023 : DSC సిల‌బ‌స్‌, బెస్ట్ బుక్స్ ఇవే..| ముందుగానే..ఇలా చ‌దివితే 'టీచ‌ర్‌' ఉద్యోగం మీదే..

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు ఐదేళ్ల వరకు, మాజీ సైనికోద్యోగులకు మూడేళ్లు, సాయుధ దళాలలో చేసిన సర్వీస్ కాలం, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదేళ్లు, శారీరక దివ్యాంగులకు పదేళ్లు వయో పరిమితిలో పదేళ్ల పాటు సడలింపు ఉంటుంది. పూర్తి సమాచారం సెప్టెంబ‌ర్ 20 నుంచి అధికారిక వెబ్‌సైట్‌ (https://schooledu.telangana.gov.in/ISMS/)లో అందుబాటులో ఉంచనున్నారు.

Published date : 08 Sep 2023 01:54PM

Photo Stories