Skip to main content

World Cup Schedule 2023 : వరల్డ్‌కప్‌-2023 పూర్తి షెడ్యూల్ ఇదే.. ఏఏ మ్యాచ్‌ ఎప్పుడంటే..?

ఐసీసీ వన్డే వరల్డ్‌కప్‌-2023 షెడ్యూల్‌ను ఐసీసీ విడుదల చేసింది. క్రికెట్‌ అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న వన్డే వరల్డ్‌కప్‌-2023 షెడ్యూల్‌ను ఐసీసీ ప్రకటించింది.
Match schedule announced for the ICC Men’s Cricket World Cup 2023
ICC Men’s Cricket World Cup Schedule 2023

ఉదయం 11:30 గంటలకు ముంబైలో జరిగే  ప్రత్యేక కార్యక్రమంలో ఐసీసీ కార్యవర్గ సభ్యులు షెడ్యూల్‌ను విడుదల చేశారు. అక్టోబర్‌ 5న అహ్మదాబాద్‌ వేదికగా ఇంగ్లాండ్, న్యూజిలాండ్‌  జట్ల మధ్య మ్యాచ్‌తో ఈ మహా సమరం మొదలుకానుంది. చిరకాల ప్రత్యర్థులైన భారత్, పాకిస్థాన్‌ (IND vs PAK) మ్యాచ్‌ అక్టోబర్‌ 15న జరగనుంది. వరల్డ్‌కప్‌ ప్రారంభ తేదీ అయిన అక్టోబర్‌ 5కు జూన్‌ 27 సరిగ్గా 100 రోజులు ముందుండంతో ఐసీసీ ఈ తేదీన షెడ్యూల్‌ విడుదల చేయాలని నిర్ణయించించిన విష‌యం తెల్సిందే.

☛ IPL 2023: ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించిన ధోని.. 12 ఏళ్ల రికార్డు బద్దలు!

హైదరాబాద్‌లోని ఉప్పల్‌ స్టేడియం వేదికగా..

ICC World Cup 2023

నవంబర్‌ 19న అహ్మదాబాద్‌ వేదికగా ఫైనల్‌ మ్యాచ్ జరగనుంది. ఇక ఈ టోర్నీలో భారత జట్టు తమ తొలి మ్యాచ్‌లో ఆక్టోబర్‌ 8న చెన్నై వేదికగా ఆస్ట్రేలియాతో తలపడనుంది. అదే విధంగా వార్మప్ మ్యాచ్‌లకు హైదరాబాద్‌తో పాటు గౌహతి, తిరువనంతపురం అతిధ్యం ఇవ్వనున్నాయి. వార్మాప్‌ మ్యాచ్‌లు  సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 3 వరకు జరగనున్నాయి. కాగా హైదరాబాద్‌లోని ఉప్పల్‌ స్టేడియం వేదికగా మూడు వరల్డ్‌కప్‌ మ్యాచ్‌లు జరగనున్నాయి.

➤☛ Virat Kohli Records : ప్రపంచ క్రికెట్‌లో చ‌రిత్ర‌లో ఏకైక ఆటగాడిగా కోహ్లి.. సాధించిన అరుదైన రికార్డులు ఇవే..

షెడ్యూల్‌ ఆలస్యంకు కార‌ణం ఇదేనా..?

ICC World Cup 2023 details

బీసీసీఐ-పీసీబీల మధ్య వరల్డ్‌కప్‌ వేదికల వ్యవహారంలో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో షెడ్యూల్‌ ప్రకటన ఆలస్యం అయిన విషయం తెలిసిందే. అయితే బీసీసీఐతో పలు చర్చల అనంతరం పీసీబీ ఈ విషయంలో అంగీకారం​ తెలిపినట్లు సమాచారం. అహ్మదాబాద్‌లో భారత్‌తో తలపడేందుకు పాక్‌ ఒప్పుకుందని తెలుస్తోంది. అలాగే ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్‌లతో బెంగళూరు, చెన్నైలలో మ్యాచ్‌లు ఆడేందుకు పాక్‌ అంగీకారం తెలిపిందని సమాచారం.  

భారత్ ఆడే మ్యాచ్‌ల వివరాలు ఇవే..

  • అక్టోబర్‌ 8: ఇండియా వర్సెస్‌ ఆస్ట్రేలియా (చెన్నై)
  • అక్టోబర్‌ 11: ఇండియా వర్సెస్‌ ఆఫ్ఘనిస్తాన్‌ (ఢిల్లీ)
  • అక్టోబర్‌ 15: ఇండియా వర్సెస్‌ పాకిస్తాన్‌ (అహ్మదాబాద్‌)
  • అక్టోబర్‌ 19: ఇండియా వర్సెస్‌ బంగ్లాదేశ్‌ (పూణే)
  • అక్టోబర్‌ 22: ఇండియా వర్సెస్‌ న్యూజిలాండ్‌ (ధర్మశాల)
  • అక్టోబర్‌ 29: ఇండియా వర్సెస్‌ ఇంగ్లండ్‌ (లక్నో)
  • నవంబర్‌ 2: ఇండియా వర్సెస్‌ క్వాలిఫయర్‌-2 (ముంబై)
  • నవంబర్‌ 5: ఇండియా వర్సెస్‌ సౌతాఫ్రికా (కోల్‌కతా)
  • నవంబర్‌ 11: ఇండియా వర్సెస్‌ క్వాలిఫయర్‌-1 (బెంగళూరు)

నాకౌట్‌ మ్యాచ్‌ల వివరాలు..

  • నవంబర్ 15:  సెమీఫైనల్-1 (ముంబై)
  • నవంబర్‌ 16: సెమీఫైనల్‌-2 (కోల్‌కతా)
  • నవంబర్‌ 19:  ఫైనల్‌ (అహ్మదాబాద్‌)

ICC వరల్డ్‌కప్‌-2023 పూర్తి షెడ్యూల్ ఇదే..

World Cup Schedule 2023 dates in telugu

☛ Virat Kohli Top Records : కోహ్లి కెరీర్‌లో ఐదు అత్యుత్తమ ఇన్నింగ్స్‌లు ఇవే.. ఎందుకంటే..?

➤☛ IPL 2023: 16 ఏళ్ల ఐపీఎల్‌ చరిత్రలో అరుదైన రికార్డు...

Published date : 27 Jun 2023 01:17PM

Photo Stories