Skip to main content

Viacom18 Bags Cricket Live Rights: భారత క్రికెట్‌ ప్రసార హక్కుల్ని దక్కించుకున్న ‘వయాకామ్‌ 18’

భారతీయ కార్పొరేట్‌ దిగ్గజ సంస్థ రిలయన్స్‌ గ్రూప్‌ క్రికెట్‌ హక్కుల్ని కైవసం చేసుకొంది.
Viacom18 Bags Cricket Live Rights
Viacom18 Bags Cricket Live Rights

భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) గురువారం నిర్వహించిన ఇ–వేలం (ఆన్‌లైన్‌)లో స్వదేశంలో జరిగే అంతర్జాతీయ, జాతీయ మ్యాచ్‌ల్ని ప్రత్యక్ష ప్రసారం చేసుకొనే మీడియా హక్కుల్ని ‘వయాకామ్‌ 18’ దక్కించుకుంది. 2023–28 ఈ ఐదేళ్ల కాలానికి గాను సుమారు డిస్నీప్లస్‌ స్టార్, సోనీ నెట్‌వర్క్‌లతో ముక్కోణపు పోటీలో పాల్గొన్న వయాకామ్‌ 18... టీవీ, డిజిటల్‌ రైట్స్‌ కోసం అత్యధికంగా రూ.5,963 కోట్లు (720.60 మిలియన్‌ డాలర్లు)తో బిడ్‌ దాఖలు  చేసింది.

World Athletics Championships: నీరజ్‌ స్వర్ణ చరిత్ర

ఈ నెల 22 నుంచి భారత్, ఆస్ట్రేలియాల మధ్య జరిగే సిరీస్‌తో 2023–28 సైకిల్‌ మొదలవుతుంది. ఈ ఐదేళ్ల సైకిల్‌లో టీమిండియా 25 టెస్టులు, 27 వన్డేలు, 36 టి20లు కలిపి మొత్తంగా 88 మ్యాచ్‌లు ఆడనుంది. ఆస్ట్రేలియాతో 21 మ్యాచ్‌లు, ఇంగ్లండ్‌తో 18 మ్యాచ్‌లు, కివీస్‌తో 11 మ్యాచ్‌లు, దక్షిణాఫ్రికాతో 10 మ్యాచ్‌ల్లో తలపడుతుంది. 

World Badminton Championships 2023: బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌లో ప్రణయ్‌కు కాంస్యం

Published date : 01 Sep 2023 04:15PM

Photo Stories