World Athletics Championships: నీరజ్ స్వర్ణ చరిత్ర
నీరజ్ రెండో ప్రయత్నంలో విసిరిన జావెలిన్ అత్యధికంగా 88.17 మీటర్ల దూరం వెళ్లింది. మొత్తం ఆరు ప్రయత్నాల్లో ఈ దూరాన్ని మరో అథ్లెట్ అధిగమించలేకపోయాడు. ఫలితంగా నీరజ్‌కు బంగారు పతకం ఖరారైంది. పాకిస్తాన్‌కు చెందిన అర్షద్ నదీమ్ 87.82 మీటర్లతో రజత పతకం దక్కించుకోగా... జాకుబ్ వాద్లెచ్ (చెక్ రిపబ్లిక్) 86.67 మీటర్లతో కాంస్య పతకం సొంతం చేసుకున్నాడు. భారత్‌కే చెందిన కిశోర్ కుమార్ జేనా 84.77 మీటర్లతో ఐదో స్థానంలో, మనూ 84.14 మీటర్లతో ఆరో స్థానంలో నిలిచారు.
World Badminton Championships 2023: బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో ప్రణయ్‌కు కాంస్యం
2016లో ప్రపంచ అండర్–20 చాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం గెలిచి వెలుగులోకి వచ్చిన నీరజ్ ఈ ఏడేళ్ల కాలంలో ఇంతింతై వటుడింతై అన్నట్లు ఎదిగాడు. 2017 ప్రపంచ సీనియర్ చాంపియన్‌షిప్‌లో తొలిసారి పాల్గొని 15వ స్థానంలో నిలిచిన నీరజ్ ఆ తర్వాత రాటుదేలాడు. అదే ఏడాది భువనేశ్వర్‌లో జరిగిన ఆసియా చాంపియన్‌షిప్‌లో బంగారు పతకం గెలిచిన నీరజ్... 2018 ఆసియా క్రీడల్లో, 2018 కామన్వెల్త్ గేమ్స్‌లోనూ పసిడి పతకాలు సొంతం చేసుకున్నాడు.
2021లో టోక్యో ఒలింపిక్స్‌లో అందరి అంచనాలను తారుమారు చేస్తూ స్వర్ణ పతకం నెగ్గిన ఈ హరియాణా స్టార్ 2022 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రజతం, 2022 ప్రతిష్టాత్మక డైమండ్ లీగ్ ఫైనల్స్‌లో స్వర్ణంతో మరింత ఎత్తుకు ఎదిగాడు. అదే జోరును కొనసాగిస్తూ తాజా ప్రపంచ చాంపియన్‌షిప్‌లో బంగారు పతకంతో యావత్ భారతాన్ని ఆనందడోలికల్లో ముంచాడు. తాజా స్వర్ణంతో నీరజ్ అథ్లెటిక్స్‌లోని అన్ని మేజర్ ఈవెంట్లలో పతకాలు నెగ్గిన జావెలిన్ త్రోయర్‌గా నిలిచాడు.
World Badminton Championships 2023: బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో ప్రణయ్‌కు కాంస్యం
ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు లభించిన మొత్తం పతకాలు. 2003లో మహిళల లాంగ్‌జంప్‌లో అంజూ జార్జి కాంస్యం సాధించగా... 2022లో నీరజ్ రజతం, 2023లో నీరజ్ స్వర్ణం గెలిచాడు.ఒలింపిక్స్‌తోపాటు ప్రపంచ చాంపియన్‌షిప్‌లోనూ స్వర్ణ పతకాలు గెలిచిన రెండో భారతీయ క్రీడాకారుడు నీరజ్ చోప్రా. గతంలో షూటర్ అభినవ్ బింద్రా ఈ ఘనత సాధించాడు. అభినవ్ బింద్రా 2006 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో, 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో పసిడి పతకాలు గెలిచాడు.
World Shooting Championship 2023: ప్రపంచ షూటింగ్ ఛాంపియన్‌షిప్‌లో రెండో స్థానంలో భారత్