Skip to main content

World Shooting Championship 2023: ప్రపంచ షూటింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో రెండో స్థానంలో భారత్‌

ప్రపంచ షూటింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో మహిళల 50 మీటర్ల పిస్టల్‌ టీమ్‌ విభాగంలో తియానా, సాక్షి సూర్యవంశీ, కిరణ్‌దీప్‌ కౌర్‌లతో కూడిన భారత జట్టు 1573 పాయింట్లతో స్వర్ణం కైవసం చేసుకుంది.
World Shooting Championship 2023
World Shooting Championship 2023

టీమ్‌ విభాగంలో సత్తా చాటిన తియానా వ్యక్తిగత కేటగిరిలోనూ కాంస్యంతో మెరిసింది. 50 మీటర్ల పిస్టల్‌లో 533 పాయింట్లతో ఆమె మూడో స్థానంలో నిలిచింది. పురుషుల 50 మీటర్ల పిస్టల్‌లో భారత్‌కు రెండు కాంస్య పతకాలు దక్కాయి. రవీందర్‌ సింగ్‌, కమల్‌జీత్‌, విక్రమ్‌ భారత జట్టు 1646 పాయింట్లతో కంచు నెగ్గింది. రవీందర్‌ సింగ్ వ్యక్తిగత కేటగిరిలో 556 పాయింట్లతో కాంస్య పతకాన్ని సాధించాడు. 6 స్వర్ణాలు, 8 కాంస్యాలతో భారత్‌ రెండో స్థానంతో టోర్నీని ముగించింది. చైనా (15 స్వర్ణ, 7 రజత, 6 కాంస్యాలు) అగ్రస్థానంలో నిలిచింది.

World Senior Shooting Championship: ప్ర‌పంచ సీనియర్‌ షూటింగ్‌ చాంపియన్‌షిప్‌లో అమన్‌ప్రీత్‌ సింగ్‌కు స్వర్ణం

Published date : 26 Aug 2023 05:16PM

Photo Stories