Skip to main content

World senior Shooting Championship: ప్రపంచ సీనియర్‌ షూటింగ్‌ చాంపియన్‌షిప్‌లో ఇషా–శివ జోడీకి స్వర్ణం

ప్రపంచ సీనియర్‌ షూటింగ్‌ చాంపియన్‌షిప్‌లో భారత్‌ ఖాతాలో తొలి స్వర్ణ పతకం చేరింది.
World senior Shooting Championship
World senior Shooting Championship

శుక్రవారం జరిగిన 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ ఈవెంట్‌లో ఇషా సింగ్‌ –శివా నర్వాల్‌ జోడీ పసిడి పతకం సొంతం చేసుకుంది. తెలంగాణకు చెందిన ఇషా సింగ్‌... హరి యాణాకు చెందిన శివా నర్వాల్‌ ఫైనల్లో 16–10తో తర్హాన్‌ ఇలేదా–యూసుఫ్‌ డికెచ్‌ (తుర్కియే) ద్వయంపై విజయం సాధించారు.

World senior Shooting Championship: ప్రపంచ సీనియర్‌ షూటింగ్‌ చాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం

అంతకుముందు 65 జోడీలు పాల్గొన్న క్వాలిఫయింగ్‌లో ఇషా సింగ్‌–శివా నర్వాల్‌ ద్వయం 583 పాయింట్లు స్కోరు చేసి టాప్‌ ర్యాంక్‌లో... తర్హాన్‌–యూసుఫ్‌ జోడీ 581 పాయింట్లు సాధించి రెండో స్థానంలో నిలిచి ఫైనల్‌కు అర్హత సాధించాయి.
580 పాయింట్లతో జియాంగ్‌ రాన్‌జిన్‌–జాంగ్‌ బౌవెన్‌ (చైనా), హనియె–సాజద్‌ (ఇరాన్‌) జంటలు సంయుక్తంగా మూడో స్థానంలో నిలిచి కాంస్య పతక పోరుకు అర్హత పొందాయి. కాంస్య పతక మ్యాచ్‌లో రాన్‌జిన్‌–జాంగ్‌ బౌవెన్‌ ద్వయం 17–7తో హనియె–సాజద్‌ జంటను ఓడించింది.  

National Sub Junior Aquatic Championships 2023: అక్వాటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో శివానికి రెండు స్వర్ణాలు

Published date : 19 Aug 2023 03:28PM

Photo Stories