Skip to main content

World Badminton Championships 2023: బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌లో ప్రణయ్‌కు కాంస్యం

అసాధారణ ఆటగాడు అక్సెల్‌సన్‌కు సొంతగడ్డపైనే చుక్కలు చూపించిన భారత షట్లర్‌ హెచ్‌.ఎస్‌.ప్రణయ్‌ పోరు సెమీ ఫైనల్లో ముగిసింది.
World Badminton Championships 2023
World Badminton Championships 2023

ప్రపంచ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌లో ఈ కేరళ స్టార్‌ కాంస్యంతోనే సరిపెట్టుకున్నాడు. క్వార్టర్స్‌లో తొలి గేమ్‌ కోల్పోయినప్పటికీ వరుస గేమ్‌లను గెలిచి పతకం ఖాయం చేసుకున్న భారత ఆటగాడు చిత్రంగా సెమీస్‌లో తొలి గేమ్‌ గెలిచి జోరు మీదుండి తర్వాత రెండు గేమ్‌లను గెలువలేక మ్యాచ్‌ ఓడిపోయా డు.
శనివారం 76 నిమిషాల పాటు సాగిన పురుషుల సింగిల్స్‌ సెమీఫైనల్లో హెచ్‌.ఎస్‌. ప్రణయ్‌ 21–18, 13–21, 14–21తో కున్లావుత్‌ వితిద్‌సర్న్‌ (థాయ్‌లాండ్‌) చేతిలో పరాజయం చవిచూశాడు. 

National Inter Institutional Table Tennis: శ్రీజకు స్వర్ణం

Published date : 28 Aug 2023 01:10PM

Photo Stories